ఆధ్యాత్మికత,అనుబంధాలు ప్రధానాంశాలు
2030నాటికి 9.3 బిలియన్‌డాలర్ల బిజినెస్
విస్తరిస్తున్నభారత పాడ్‌కాస్ట్ మార్కెట్
అమెరికా, చైనాల తర్వాతఇండియానే!
సాక్షి, స్పెషల్ డెస్క్ : నాడు రేడియో–నేడు పాడ్‌కాస్ట్.. ఒకప్పుడు మన తాతయ్య తరం వాళ్లు రేడియోలు చెవి దగ్గర పెట్టుకుని వింటూ కనిపించేవాళ్లు. ఇప్పుడు మనం ఫోన్‌లు చేత్తో పట్టుకుని పాడ్‌కాస్ట్‌లు వింటున్నాం. సీన్ మారింది కానీ, ‘వినే’ అలవాటు మాత్రం మారలేదు. పాడ్‌కాస్ట్‌లు వినడంలో ప్రపంచంలోనే ఇండియా ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత 3వ స్థానంలో ఉంది.
వినటం మన డీఎన్‌ఏలోనే ఉంది!
కబుర్లు వినే అలవాటు భారతీయుల డీఎన్‌ఏలోనే ఉన్నట్లుంది. ఆ అలవాటుకు తగ్గట్లుగా పాడ్‌కాస్ట్‌లు రకరకాల సబ్జెక్టులపై కమ్మటి లోకాభిరామాయణం వినిపిస్తున్నాయి. ఏమీ తోచక బోర్ కొడుతున్నప్పుడు పాడ్‌కాస్ట్.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినప్పుడు పాడ్‌కాస్ట్.. నాలెడ్జ్ కోసం, వినోదం కోసం, మనశ్శాంతి కోసం పాడ్‌కాస్ట్... ఇలా పాడ్‌కాస్ట్‌లనేవి భారతదేశపు అధునాతన రేడియోలు అయ్యాయి. తక్కువ ధరకే లభ్యమౌతున్న వై–ఫై, 4జీ, 5జీ డేటా..పాడ్‌కాస్ట్‌లకు అమితమైన ప్రజాదరణదక్కడానికి ప్రధాన కారణాలు.
పాడ్‌కాస్ట్‌లకు డబ్బులే డబ్బులు
ఇండియాలో పాడ్‌కాస్ట్ రంగంఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం. వాణిజ్య ప్రకటనదారులు కూడా ‘వినేవారు మనవారే’ అన్నంత ఉదారంగా, పాడ్‌కాస్ట్‌లకు ప్రకటనలను కుమ్మరిస్తున్నారు.

ఏం వింటున్నారు?
కామెడీ అనుకుంటున్నారు కదూ! కాదట. ‘జ్ఞానాన్ని’ ఎక్కువగా ఇష్టపడుతున్నారట!అందులోనూ భక్తి, మోటివేషన్, బిజినెస్ అంటే చెవులు కోసుకుంటారని స్పాటిఫై, యూట్యూబ్ వార్షిక నివేదికలు చెబుతున్నాయి.

ఎక్కడ వింటున్నారు?
ప్రధానంగా యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌లనువింటున్నారు. యూట్యూబ్‌లోనే వీడియో పాడ్‌కాస్ట్‌లను చూస్తున్నారు. అలాగే కొన్ని మ్యూజిక్ యాప్స్ కూడా పాడ్‌కాస్ట్‌లనుఅందిస్తున్నాయి.

2026లోపాడ్‌కాస్ట్‌లు ఎలాఉండబోతున్నాయి?
లోకల్ ఫీల్ : ఇంగ్లిష్‌ను మించి తెలుగు, మరాఠీ, బెంగాలీ, ఇతర భాషల్లో పాడ్‌కాస్ట్‌లు హోరెత్తించబోతున్నాయి.
ఏఐ వాయిస్ : నిజమైన మనుషుల స్థానంలో ఏఐ రోబోలే మనకు పాడ్‌కాస్ట్‌లను వినిపిస్తాయి.
లైవ్ షోలు : కేవలం ఫోన్‌లలోనే కాదు, స్టేజ్ మీద కూడా పాడ్‌కాస్ట్‌లను చేసి టికెట్స్ విక్రయిస్తారు.
(ఆధారం : గ్రాండ్ వ్యూ రీసెర్చ్ అండ్ మార్క్‌ఎన్‌టెల్ అడ్వైజర్స్)


