నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న వ్యక్తి మృతిచెందినట్లు ఎస్‌ఐ కె.సతీష్ ఆదివారం తెలిపారు. మండలంలోని కుంకలగుంట గ్రామానికి చెందిన కాకర్ల వెంకటేష్ తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఈనెల 5న మాచవరం వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి కుంకలగుంటకు వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై నిలిచి ఉన్న ట్రాక్టర్‌ను బైకు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న వెంకటేష్ ఆదివారం మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


