మంగళగిరిటౌన్: చైనాలో ఈ నెల 10 నుండి 15వ తేదీ వరకు జరిగిన ఏషియన్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారిణి ప్రతిభ చాటి మెడల్స్ సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయభాస్కరావు తెలిపారు. మంగళగిరిలోని వారి కార్యాలయం నుంచి శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర షానూన్ ఈ పోటీల్లో 47 కేజీల విభాగంలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. షానూన్ ఉత్తమ ప్రదర్శన చేసి పతకం సాధించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.


