రెండు లారీలు ఢీకొని డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీకొని డ్రైవర్‌ మృతి

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

నాదెండ్ల: ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా స్లో అవటంతో వేగంగా వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆర్‌.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు.. నూతన బైపాస్‌ రోడ్డుపై గణపవరం పరిధిలోని హైవే కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో గుంటూరు నుంచి వినుకొండ వెళ్తున్న లారీని గుంటూరులో పత్తి అన్‌లోడ్‌ చేసి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ వెనుక వైపు నుంచి ఢీకొంది. పత్తి లారీ డ్రైవర్‌ ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరుకు చెందిన మన్నెం సుబ్రహ్మణ్యం(37) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement