బంగారం దుకాణంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

బంగారం దుకాణంలో చోరీ

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

బంగారం దుకాణంలో చోరీ సత్తెనపల్లి: బంగారం దుకాణంలో చోరీ జరిగిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని గోళ్లమూడివారి వీధిలోని నాగలక్ష్మి జ్యూయలర్స్‌, శ్రీకృష్ణ డైమండ్‌ హాల్‌ జ్యూయలర్స్‌ దుకాణాల్లో తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. నాగలక్ష్మి జ్యూయలరీ దుకాణంలో రూ.8 లక్షల విలువ చేసే మూడు కేజీల వెండి వస్తువులను అపహరించుకుపోయారు. మరో దుకాణం తాళాలు పగులగొట్టినప్పటికీ చోరీ జరగలేదు. దుకాణ యజమాని కొప్పురావూరి తిరుమల హరీష్‌ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి సీసీ కెమెరాలు పరిశీలించారు. అనంతరం క్లూస్‌ టీమ్‌ వేలిముద్రలు సేకరించింది. హరీష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడి వ్యక్తి మృతి రాజుపాలెం: మద్యం మత్తులో ప్రమాదవశాత్తూ పాడుబడ్డ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కొండమోడు జంక్షన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొండమోడు పరిధిలో గల వీరమ్మకాలనీకి చెందిన పొదిలి శ్రీనివాసరావు(68) మద్యానికి బానిసయ్యాడు. ఐదు రోజుల కిందట పాడుపడ్డ బావి ఒడ్డుపై మద్యం సేవిస్తూ జారి బావిలో పడి మృతి చెందినట్లు తెలిపారు. బావివద్ద దుర్వాసనలు రావడంతో చుట్టుప్రక్కల వారు రాజుపాలెం పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ మణికృష్ణ, పోలీసు సిబ్బంది చేరుకుని మృతదేహాన్ని జేసీబీతో బయటకు తీశారు. మృతదేహం పూర్తిగా పాడైపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందింది. మృతుడు వెల్డింగ్‌ పనులు చేస్తూ అప్పటి నుంచి మద్యానికి పూర్తిగా బానిసైనట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి పిడుగురాళ్లరూరల్‌: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఉల్లూరి అప్పారావు తాడికొండ మండలం పెదపరిమి గ్రామంలో షేక్‌ అసియా ఇంట్లో గేదెలు కాసేందుకు కాపరిగా వెళ్లాడు. బుధవారం రాత్రి షేక్‌ అసియాను తీసుకొని అప్పారావు తన సొంత గ్రామంలోని తుమ్మలచెరువులోని తన నివాసానికి వచ్చాడు. షేక్‌ అసియా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయి. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పారావు తన భార్య హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడు. పిల్లలు గురజాల పట్టణంలోని అమ్మమ్మవారి ఇంటి వద్ద జీవిస్తున్నారు. షేక్‌ ఆసియా, అప్పారావుది వివాహేతర సంబంధం వలన జరిగిన హత్యనే అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ట్రాక్టర్‌ తిరగబడి డ్రైవర్‌ దుర్మరణం నూజండ్ల: ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌ తిరగబడటంతో డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన గురప్పనాయుడుపాలెం వద్ద శుక్రవారం జరిగింది. అదే గ్రామానికి చెందిన దావీదు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్‌ మరమ్మతుల నిమిత్తం వినుకొండకు వెళ్లి వస్తుండగా గ్రామ సమీపంలోని మూలమలుపు వద్దకు వచ్చే సరికి వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడింది. ట్రాక్టర్‌ క్రింద పడిన దావీదు అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతుడుకి భార్య మరియమ్మ, కూతురు, కొడుకు ఉన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని చిన్నారి మృతి

యద్దనపూడి: గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పూనూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన కొండా మాధవరెడ్డి వెంకటరత్నం దంపతుల కుమారుడైన కృష్ణారెడ్డి(7) రాత్రి 7 గంటల ప్రాంతంలో తన ఇంటి సమీపంలోని శివాలయం సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ తరువాత కొంతసేపటికి అటుగా వెళ్తున్న కొందరు గమనించి రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని గుర్తించి 108 వాహనంలో చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి కృష్ణారెడ్డి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగాను ఒక్క కుమారుడు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement