వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

నరసరావుపేట: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఉచిత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అందుకు సంబంధించిన కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భం ఆమె మాట్లాడుతూ 3 నుంచి 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ చదివే విద్యార్థినులు, విద్యార్థులకు వేరు వేరు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తులు గ్రామ సచివాలయం వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, వసతి గృహ సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల కార్యాలయాల్లో పొందాలని సూచించారు. ఇన్‌చార్జి జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారత అధికారి కె.సంతోష్‌ కుమార్‌, వసతి గృహ సంక్షేమ అధికారులు జయప్రద, రాణమ్మ, రాజేశ్వరి, రామాంజనేయులు, వెంకటేశ్వర నాయక్‌, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement