ఉద్యోగ, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

నరసరావుపేట ఈస్ట్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చటంలో విఫలమైందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటసుబ్బయ్య తెలిపారు. అరండల్‌పేటలో ఆదివారం నిర్వహించిన పీడబ్ల్యూడీ వర్క్‌షాప్‌ అండ్‌ కెనాల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ కేంద్ర కమిటీ 31వ మహాసభలో వెంకటసుబ్బయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లా డారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆయా వర్గాల సమస్యలను పరిష్కంచటంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాడు నాగార్జునసాగర్‌ పరిధిలోని ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించేలా ఏఐటీయూసీ కృషి చేసి విజయం సాధించిందని వివరించారు. కార్మిక శ్రేయస్సు కోసం అందరితో కలసి పోరాటాలలో ముందుండాలని తెలిపారు. యూనియన్‌ పతాకాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు ఆవిష్కరించారు. మహాసభలో నివేదికను కెనాల్స్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ ఉప్పలపాటి రంగయ్య ప్రవేశపెట్టారు. సీపీఐ సీనియర్‌ నాయకులు షేక్‌ బుడే, యూనియన్‌ నాయకులు ఎల్‌.శాంతి, ఎం.బాబురావు, కాసా సాంబయ్య పాల్గొన్నారు.

ఏఐటీయూసీ డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement