న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026
మాయమవుతున్న
‘మాయవయ్యాడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అన్నట్లుగా.. స్వార్ధం నిండిన సమాజంలో మనుషుల్లో మానవత్వం మంట గలిసిపోతుండగా.. అంతంతమాత్రంగానైనా ఉన్న ప్రేమలు అంతర్ధానమవుతున్నాయి. విలువల వలువలు విప్పగా.. మనిషిగా చచ్చి.. అతనిలోని రాక్షసత్వం బట్టబయలై నడిరోడ్డుపై వికటట్టహాసం చేస్తోంది. ఈక్రమంలో తోటివారికి సాయం దేవుడెరుగు.. ఆస్తిపాస్తుల కోసం సొంతవారినే హతమార్చేందుకు వెనుకాడని ఘటనలు ఎన్నో చూస్తున్నాం.. ఇందులో లింగభేదం ఎంతమాత్రం లేకపోవడం విశేషం. ఆస్తికోసం తోడబుట్టిన వారిని తుదముట్టించిన సోదరి.. కన్నతల్లిదండ్రులపై పెట్రోలు పోసి తగలబెట్టేందుకు యత్నించిన కూతురు.. వృద్ధుడనే కనికరం కూడా లేకుండా తండ్రిని చంప చూసిన కసాయి కొడుకు.. ఇలాంటి ఘటనలో జిల్లాలో నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి.


