కొరిటెపాడు(గుంటూరు): అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఎన్‌బీసీసీతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) మంగళవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై బ్యాంక్ చీఫ్ రీజినల్ మేనేజర్ హర్షిత్ సింగ్ సమక్షంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం) కె.ఆస్వథ్ రామన్ నిర్వహించారు. ఐఓబీ తరపున హర్షిత్ సింగ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేయగా, ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ రావు, జనరల్ మేనేజర్ రాజారాం సంతకాలు చేశారు. అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలను రెండు సంస్థలు పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ కార్యాలయం బ్యాంక్ విస్తరిస్తున్న వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతంలో వినియోగదారుల సేవలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఐఓబీ బ్యాంక్ అధికారులు తెలిపారు.


