అక్రమాలకు ‘సహకారం’ | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు ‘సహకారం’

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

కేసుల పరిష్కారానికి ముందుకు రండి ఐసెట్‌లో 87.30 శాతం ఉత్తీర్ణత నేడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రాక 25 సవర్ల బంగారం చోరీ

అన్నవరం పీఏసీఎస్‌లో

అవినీతిపై ఫిర్యాదులు

విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్‌

వెలుగులోకి సీఈవో శ్రీనివాసరావు

అక్రమాలు, వేధింపులు

సీఈవో వైఖరితో ఉద్యోగి ఆత్మహత్య

విచారణ నిలిపివేయాలని

సహకార మంత్రికి ఎమ్మెల్యే లేఖ

అంగీకరిస్తూ చంద్రబాబు

ప్రభుత్వం ఉత్తర్వులు

పాలకుల తీరుపై అన్నదాతల

తీవ్ర ఆగ్రహం

నరసరావుపేట టౌన్‌: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సదస్సు నిర్వహించారు. సమాధాన్‌ సమరోహ 2026లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ జియావుద్దీన్‌ మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నవారు ఆగస్టు 21, 22, 23 తేదీలలో జరగనున్న ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని కోరారు. దీనికోసం ఈ నెల 31వ తేదీలోపు నిర్దేశిత గూగుల్‌ ఫారం పూరించి తమ అంగీకారం తెలియజేయాలన్నారు. ప్రజల అవగాహన కోసం ముద్రించిన ప్రత్యేక కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఏపీపీ కట్ట కాళిదాస్‌, మొదటి పట్టణ సీఐ షేక్‌ టి.ఫిరోజ్‌, ట్రాఫిక్‌ సీఐ లోకనాథం, ఎస్‌ఐ వంశీకృష్ణ, ప్యానల్‌ న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, పలువురు ప్రజలు పాల్గొన్నారు.

నరసరావుపేట ఈస్ట్‌: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఐసెట్‌ ప్రవేశ పరీక్షలో పల్నాడు జిల్లా 87.30 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఐసెట్‌ ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 511 మంది నమోదు కాగా పరీక్షకు 449 మంది హాజరయ్యారు. వీరిలో 392 మంది అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 201 మంది పురుషులు, 191 మంది మహిళలు ఉన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో చేరేందుకు అర్హులు.

పథకాలను మాజీ సైనికులు

సద్వినియోగం చేసుకోండి

మాచర్ల రూరల్‌: మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగపర్చుకోవాలని సైనిక సంక్షేమ ఉమ్మడి జిల్లా శాఖాధికారి ఆర్‌.గుణశీల కోరారు. శనివారం పెన్షనర్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుందని సాగు భూమితో పాటు పిల్లల చదువులలో రిజర్వేషన్‌, క్యాంటీన్‌లో సబ్సిడీపై అందించే వివిధ వస్తువులను సకాలంలో తీసుకోవాలని కోరారు. విద్యకు స్కాలర్‌షిప్‌, కుమార్తె వివాహానికి నగదు, వైకల్య గ్రాంటు, ఈసీహెచ్‌ఎస్‌ ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందుకోవాలన్నారు. మృతిచెందిన మాజీ సైనికుల భార్యలకు గుర్తింపు కార్డులను అందించారు. ఇటీవల అంగవైకల్యం పొందిన ఇన్నారెడ్డి గృహానికి వెళ్ళి పరామర్శించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కేపీ సిద్ధంరాజు, ప్రధానకార్యదర్శి తాటి వినోద్‌బాబు, కోశాధికారి ఆర్‌ గోపాల్‌ నాయక్‌, ఉపాధ్యక్షులు వి.మరియదాసు, సభ్యులు కారంకి శ్రీనివాసరావు, రామారావు, పి.బాబు, ఇన్నారెడ్డి, శేఖర్‌, రవి పాల్గొన్నారు.

పొన్నూరు: మామిళ్లపల్లి రైతులపై టీడీపీ నాయకులు దాడి చేసి అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదివారం రానున్నారని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు మామిళ్లపల్లి అడ్డరోడ్డు నుంచి మామిళ్లపల్లి వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.

లక్ష్మీపురం: ఓ ఇంట్లో 25 సవర్ల బంగారం, రూ.2.50 లక్షల నగదు చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. ముత్యాలరెడ్డినగర్‌ 8వ లైన్‌ ప్రాంతానికి చెందిన దుగ్గెంపూడి ప్రభాకర్‌రెడ్డి కన్‌స్ట్రక్షన్‌ పని చేస్తుంటారు. భార్య భూలక్ష్మి ఇంటి వద్దనే ఉంటుంది. ఇంట్లో బీరువాలో ఉన్న 25 సవర్ల బంగారం, అలాగే బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు కనిపించలేదు. దీన్ని గమనించిన ప్రభాకర్‌రెడ్డి ఆయన సతీమణి భూలక్ష్మి, ఇంట్లో పని చేసే మహిళపై అనుమానం వ్యక్తం చేశారు. బాధితులు అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నరసరావుపేట రూరల్‌: అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై జరుగుతున్న విచారణను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మూడు దశాబ్దాలుగా అన్నవరం సొసైటీలో తిష్ట వేసిన వ్యక్తి అందినకాడికి దండుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డాడు. వాటిని తట్టుకోలేక గుమస్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో మహిళా ఉద్యోగిని కూడా జీతాలు ఇవ్వకుండా వేధించాడు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగి.. సొసైటీలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని విన్నవించారు. దీంతో అక్రమాల డొంక కదిలింది. దీనిని ఆదిలోనే ఆపాలని సదరు ఉద్యోగి ఏకంగా కూటమి ఎమ్మెల్యేతో ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో విచారణను ప్రభుత్వం నిలిపివేసింది.

రొంపిచర్ల మండలం అన్నవరం పీఏసీఎస్‌ అవినీతిపై జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాకు పలు మార్లు ఫిర్యాదులు అందాయి. సొసైటీ పరిధిలోని రైతులతోపాటు సిబ్బంది సైతం అవినీతి గురించి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌... జిల్లా సహకార అధికారిని విచారణకు ఆదేశించారు. సొసైటీ రికార్డులను పరిశీలించి రైతులను అధికారులు విచారించారు. పీఏసీఎస్‌లో అవినీతి నిజమేనని నిగ్గు తేల్చారు. విచారణలో రూ.16.86 లక్షల అవినీతి జరిగిందని నిర్ధారించారు. సెక్షన్‌ 52 ప్రకారం పూర్తి స్థాయి విచారణకు జిల్లా సహకార అధికారి నాగరాజు ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఆదేశించారు. పీఏసీఎస్‌ సీఈవోగా పనిచేస్తున్న దొప్పలపూడి శ్రీనివాసరావు అవినీతిలో కీలక సూత్రధారి అని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. శ్రీనివాసరావు భార్య ఉషారాణిని సొసైటీ ఉద్యోగినిగా చూపిస్తూ 2014–19 కాలానికి రూ.6.12 లక్షలు వేతనంగా డ్రా చేశాడు. అయితే ఉషారాణిని కార్యాలయంలో ఎప్పుడూ చూడలేదని విచారణలో అధికారులకు రైతులు తెలిపారు. గతంలో శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్‌ అయ్యాడు. ఈ కాలానికి కూడా సొసైటీ నుంచి జీతాలు, పాత బకాయిలను సొసైటీ మినిట్‌ పుస్తకంలోని ఖాళీ పేజీలలో నకిలీ తీర్మానాలు సృష్టించి మొత్తం రూ.8.94 లక్షలు తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. రైతు నుంచి వసూళ్లు చేసిన రూ.1.90 లక్షలను బ్యాంక్‌లో జమ చేయనట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా గతంలో సొసైటీలో పెయిడ్‌ సెక్రటరీగా పనిచేసిన జేపీ కుమార్‌కు ఇవ్వాల్సిన మొత్తం రూ.3.45 లక్షలను కూడా శ్రీనివాసరావు నకిలీ తీర్మానాలతో డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు.

ఎమ్మెల్యే చదలవాడ అండ

అన్నవరం పీఏసీఎస్‌లో జరిగిన అవినీతిపై పూర్తి స్ధాయి విచారణ జరిగితే మరింత అక్రమాలు వెలుగులోకి వస్తాయని భావించిన సీఈవో శ్రీనివాసరావు... ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబును ఆశ్రయించాడు. సీఈవోపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఎమ్మెల్యే నేరుగా సహకార శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు ఏప్రిల్‌ 2వ తేదీన లేఖ రాశారు. దీనిపై స్పందించిన మంత్రి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్నవరం పీఏసీఎస్‌పై విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి వంతు పాడుతూ ఎమ్మెల్యే విచారణ నిలిపివేయాలని కోరడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement