బస్సుల సంఖ్య తగ్గించారు | - | Sakshi
Sakshi News home page

బస్సుల సంఖ్య తగ్గించారు

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

బస్సుల సంఖ్య తగ్గించారు

గతంలో వినుకొండ నుంచి పిడుగురాళ్ల మధ్య మొత్తం 16 బస్సులు నడిచేవి. ఉచిత బస్సు పథకం ప్రారంభమైన తరువాత వాటి సంఖ్య 8కి తగ్గించారు. బస్సులు పెంచాల్సిందిపోయి తగ్గించడంతోనే వినుకొండలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు పాయింట్‌లోకి రాగానే ప్రయాణికులు ఎగబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పట్టుతప్పి పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా పోలీసులను పెట్టి నియంత్రించినా ఉపయోగం లేదు.

– ఉలవలపూడి రాము,

సీపీఐ పట్టణ కార్యదర్శి, వినుకొండ

Advertisement
 
Advertisement
Advertisement