జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు రాష్ట్ర జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు రాష్ట్ర జట్టు ఎంపిక

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

సత్తెనపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లాలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగే 45వ జాతీయస్థాయి సబ్‌ జూనియర్స్‌ షూటింగ్‌ బాల్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ బాల, బాలికల జట్టును ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పరుశరాముడు సోమవారం ప్రకటించారు.

బాలుర జట్టు రామ్‌ తేజ్‌, ( కెప్టెన్‌ కృష్ణా జిల్లా), తిరుమల సాయి త్రినేష్‌ (విశాఖపట్నం), నందన్‌రెడ్డి (గుంటూరు), కార్తీక్‌ (కర్నూలు), శ్రీను నాయక్‌ (అనంతపురం), సురేష్‌, చితాస్‌ (పల్నాడు), గణేష్‌ (అన్నమయ్య), శేషాద్రి (తిరుపతి), అభిలాష్‌ (అనంతపురం), రిత్విక్‌ రెడ్డి (నెల్లూరు), ఎతిక్‌ రత్న (ఏలూరు) ఎంపికయ్యారు.

బాలికల జట్టు యశస్విని (కెప్టెన్‌, చిత్తూరు జిల్లా), భూమిక (విశాఖపట్నం), గీతిక (గుంటూరు) ఊహ (గుంటూరు), సుచరిత (ప్రకాశం) ,హర్షిత (పల్నాడు), స్వాతి కీర్తన (పల్నాడు), శేన్షి (తిరుపతి), శ్రీలత (అన్నమయ్య), అర్చన (నెల్లూరు), జశ్విత రాణి (అనంతపురం), ఎం.హర్షిణి (గుంటూరు)లు ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో రాణించి విజయంతో తిరిగి రావాలనీ పరశు రాముడు అభినందించారు. కార్యక్రమంలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి కిరణ్‌కుమార్‌, కృష్ణా జిల్లా కార్యదర్శి విజయకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement