న్యూస్‌రీల్
అడ్డగోలు అలవాట్లతో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు
మాంసాహారానికే ప్రాధాన్యత...
వారంతంలో రెట్టింపు వ్యాపారం...
నిమ్మకాయల ధరలు
పులిచింతల సమాచారం
సాగర్ నీటిమట్టం
ఆరోగ్య సమస్యలు
శరీరాకృతిలో మార్పులు
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026
వారాంతం ఆహా..
● వారంలో ఐదు రోజులపాటు
వ్యాయామాలు, మితంగా తిండి
● శని, ఆదివారాల్లో నచ్చిన
పదార్థాలు ఎక్కువ తినేందుకు ఆసక్తి
● తెల్లవారుజామున 4 గంటలకే
బిర్యానీ సిద్ధం చేస్తున్న హోటళ్లు
● అర్ధరాత్రి దాటిన తరువాత
కూడా భారీగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు
● బయటి ఆహారంతో ఆరోగ్య
సమస్యలు తప్పవంటున్న నిపుణులు
●
7
గుంటూరు లీగల్/చిలకలూరిపేట టౌన్: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి గుంటూరు పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాయపూడి మరియదాసు(57) బాధిత బాలిక తల్లితో సహజీవనం చేస్తూ ఉండేవాడు. బాలికతో మరియదాసు అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడు. నిందితుడి ప్రవర్తన గురించి బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పలుమార్లు హెచ్చరించినప్పటికీ, అతడు తన వైఖరి మార్చుకోలేదు. దీంతో బాధితురాలి తల్లి నిందితుడి నుంచి దూరంగా నివసించడం ప్రారంభించింది. అనంతరం బాలిక చదువుతున్న పాఠశాలలో శక్తి టీం సభ్యులు ‘గుడ్ టచ్–బ్యాడ్ టచ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో బాలిక తనపై జరుగుతున్న వేధింపులను టీం సభ్యులకు వివరించింది. శక్తి టీం సభ్యులు బాలిక తల్లిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షేక్ షమ్మి పర్వీన్ సుల్తానా బేగం నిందితుడు రాయపూడి మరియదాసుకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదనంగా బాధిత బాలికకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణ అధికారులుగా సీఐ వి.సూర్యనారాయణ, ఎస్సై శివరామయ్య, కోర్టు కానిస్టేబుల్ ఎం.బాలాజీ నాయక్‌లు కేసు పురోగతికి సహకరించారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
సాక్షి, నరసరావుపేట: ఉద్యోగులైనా, వ్యాపారులైనా, విద్యార్థులైనా, గృహిణులైనా... ఇలా ఏ వర్గానికి చెందిన వారైనా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆరోగ్యం కాపాడుకోవడానికి మంచి పద్ధతులు పాటిస్తున్నారు. రోజూ వ్యాయామం, యోగా, ఆహార నియామాలు పాటించడం, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, సీజనల్ ఫ్రూట్స్ తినడం వంటివి చేస్తున్నారు. వీరిలో చాలా మంది శని, ఆదివారాలు వచ్చేసరికి తమ మెనూ మార్చేస్తున్నారు. రోజువారీ చేసే పనులు, తినే ఆహారానికి స్వస్తి పలికి సరదాగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ సరదా సందడిలో నిత్య వ్యాయామానికి దూరమవడంతోపాటు, తమకు నచ్చిన ఆహార పదార్థాలను ఎక్కువ మొత్తంలో తినేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవడంతో పాటు శరీర ఆకృతిలోనూ తేడాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిత్యం ఆహార నియమాలు పక్కాగా పాటిస్తూ, సేంద్రియ ఉత్పత్తుల వైపు మొగ్గుచూపే నగర, పట్టణ వాసులు సైతం వారాంతంలో మాత్రం మసాలాలతో కూడిన మాంసాహారం తినేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజువారీ తినే ఆహారం కన్నా విభిన్నంగా ఉండే ఆహారాన్ని తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు ఉదయం నుంచి రాత్రి వరకు డైట్ పాటించి...అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కువ కేలరీలు లభించే ఆహారం తింటున్నారు. అందుకే గుంటూరు నగరం వన్‌టౌన్ ప్రాంతంలోని హోటళ్లలో మిడ్‌నైట్ బిర్యానీలకు యమా గిరాకీ ఉంటోంది. కొత్తగా 4ఏఎం బిర్యానీలంటూ తెల్లవారుజామున నాలుగింటికే రకరకాల బిర్యానీలు వేడివేడిగా వడ్డిస్తున్నారు. వీటిని వారాంతంలో తినడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు.
అనధికార లే అవుట్‌లపై స్పెషల్ డ్రైవ్
తాడువాయి అడవిలో నరికిన చెట్టు
తెనాలి: మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,700, మోడల్ ధర రూ.4,200 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.4920 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 524.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
ప్రజల జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి. చాలా మంది వారాంతంలో ఆహార నియమాలను మార్చేసుకుంటున్నారు. రాత్రి ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. రాత్రిళ్లు ఎక్కువసేపు మెలకువగా ఉండి, ఆహారం తినడం వల్ల ఊబకాయం వస్తుంది. వీలైనంతవరకు బయటి ఆహారం తినకపోవడం మంచిది.
– డాక్టర్ అంకినీడు ప్రసాద్, ఏరియా వైద్యశాల
వారంలో ఐదు రోజులు పాటు వ్యాయామం చేసి చివర రెండు రోజులు మానేయడం, ఎక్కువ ఆహారం వల్ల శరీరాకృతిలో మార్పులొస్తాయి. ఐదు రోజుల జిమ్ ఫలితం మొత్తం పోతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా, వారాంతమైనా వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. ఆహార నియమంలో కొంత మేరకు తీసుకోవడం వెసులుబాటు తీసుకుంటే ఇబ్బంది లేదు.
– అజీజ్, జిమ్ నిర్వాహకుడు, నరసరావుపేట


