సమగ్ర శిక్ష పోస్టుల భర్తీలో మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర శిక్ష పోస్టుల భర్తీలో మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

● డీవెఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కమిటీ డిమాండ్‌ ● అర్హులైన అభ్యర్థులకు అన్యాయంపై ఆగ్రహం ● జీసీడీఓ, ఏఎల్‌ఎస్‌సీఓ పోస్టుల ఎంపికలో పారదర్శకత కోరుతూ డీఆర్‌ఓకు వినతి

నరసరావుపేట: పల్నాడు జిల్లా విద్యా శాఖలో సమగ్ర శిక్ష విభాగం కింద ఖాళీగా ఉన్న జీసీడీఓ, ఏఎల్‌ఎస్‌సీఓ పోస్టులను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని డీవైఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారికి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఆంజనేయరాజు మాట్లాడుతూ అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా మార్కులు కేటాయించి మెరిట్‌ జాబితా సిద్ధం చేయడంలో విద్యాశాఖ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల ఒకటో తేదీ నాటికే మెరిట్‌ జాబితా సిద్ధమైనా కొందరు అనర్హులకు డీఆర్‌పీ శిక్షణ పేరిట అదనపు మార్కులు కేటాయించి జాబితాలో మార్పులు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement