న్యూస్‌రీల్
నిమ్మకాయల ధరలు
పులిచింతల సమాచారం
దుర్గమ్మకు భక్తుల విరాళాలు
పల్నాడు
శుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026
చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో ప్రయాణికులకు తీవ్ర కష్టాలు
7
సాక్షి, నరసరావుపేట: బస్సులలో ప్రయాణించే సమయంలో అప్పుడప్పుడు దురదృష్టవశాత్తు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. చంద్రబాబు ప్రభుత్వం సీ్త్ర శక్తి పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం కారణంగా బస్సు ఎక్కే సమయంలోనే తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వినుకొండ బస్టాండ్‌లో గత కొంతకాలంగా మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బస్సు వెనక్కి తీసుకుంటుండగా ఒకసారి, గ్యారేజ్ నుంచి వస్తున్న బస్సును గేటు వద్దే ఎక్కే ప్రయత్నంలో రెండోసారి నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తాజాగా బుధవారం పిడుగురాళ్ల వెళ్లే బస్సు ఎక్కే సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. వేల్పూరుకు చెందిన మోక్షజ్ఞ అనే బాలిక టైర్ కింద పడి కాలికి గాయాలయ్యాయి. వరుస ప్రమాదాలకు కారణం ఈ పథకానికి అవసరమైన మేరకు బస్సులు అందుబాటులో ఉంచకపోవడమేనని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పథకం అమలు చేసే ముందు కొత్త బస్సులను కొనుగోలు చేసి వాటి సంఖ్య పెంచుతామన్న చంద్రబాబు ప్రభుత్వం... ఆ దిశగా కనీస చర్యలు తీసుకోలేదు. దీంతో ఆర్టీసీ బస్టాండుల వద్ద ఉచిత బస్సు ఎక్కాలంటే యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. బస్సు రాగానే ఒక్కసారిగా ప్రయాణికులు గుమిగూడి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. మరికొన్నిసార్లు ప్రయాణికుల మధ్య ఘర్షణ జరుగుతోంది. పథకం అమలు తరువాత పెరిగిన అక్యూపెన్సీ ప్రకారం బస్సులను పెంచడం, అన్ని సర్వీసులకు ఉచితం అమలు చేయకపోవడమే వీటన్నింటికి కారణం.
తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.5200, మోడల్ ధర రూ.4000 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై నిత్యాన్నదానానికి ఉండవల్లికి చెందిన కొండా బాలప్రదీప్, విజయశాంతి దంపతులు రూ.1,00,116 విరాళమిచ్చారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో చంద్రబాబు సర్కారు నిర్వాకం కారణంగా మహిళలతోపాటు సాధారణ ప్రయాణికులు కూడా నానా అవస్థలు పడుతున్నారు. సరిపడా సర్వీసులు లేక గంటల తరబడి ఎదురుచూసినా బస్సులు రావడం లేదు. వచ్చిన వాటిలో ఎక్కడానికి కూడా పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. సీట్ల కోసం పాట్లు తప్పడంలేదు. మిగిలిన వారు కాలు పెట్టాలన్నా పరిస్థితి కష్టంగా మారుతోంది. సరిపడా బస్సులు లేకపోవడంతో సమస్య తీవ్రంగా ఉన్నా పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


