నరసరావుపేట రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామారాజు త్యాగస్ఫూర్తి, దేశభక్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యక్రమంలో పాల్గొని అల్లూరి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో అల్లూరి సీతారామరాజు చిరస్థాయిగా నిలిచిపోయాడని తెలిపారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించి అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను అర్పించడాని వివరించారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ అల్లూరి సేవా భావం, క్రమశిక్షణ, ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఆర్‌ఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఎస్‌బీ సీఐ బి.సురేష్‌బాబు, వెల్ఫేర్ ఆర్‌ఐ గోపీనాధ్, సిబ్బంది పాల్గొన్నారు.


