నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నరసరావుపేట: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం రెండు గంట వరకు కలెక్టరేట్‌లో ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు తప్పనిసరిగా పాత అర్జీ రసీదు తీసుకురావాలని, అర్జీలో పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కార్యాలయాలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో కూడా పీజీఆర్‌ఎస్‌ జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమీప కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అర్జీదారులు కలెక్టరేట్‌కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చునని సూచించారు. అన్నీ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటలకు రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, మండల తహసీల్దార్లు తప్పనిసరిగా రెవెన్యూ క్లినిక్‌కు హాజరై వినతులను స్వీకరిస్తారని తెలిపారు. ఆర్‌డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు సంబంధిత ఏఓ, డీటీలు అందుబాటులో ఉంటారని తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇనస్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు తమకు సంబంధించిన అన్ని రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. రైతులు, ప్రజలు తమ భూసంబంధిత సమస్యలు, రెవెన్యూ సమస్యలను ఈ రెవెన్యూ క్లినిక్‌ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement