కనీస జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

కనీస జాగ్రత్తలు పాటించాలి

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

కనీస జాగ్రత్తలు పాటించాలి

జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాల రోగులు, చిన్న పిల్లలు మారిన వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు పడుతుంటారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను ఎండలో బయట తిరగకుండా చూడాలి. వృద్ధులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం, తదితర సహజసిద్ధ ద్రవపదార్థాలను సేవించాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే కాటన్‌ దుస్తులు ధరించాలి. కూలింగ్‌ గ్లాసు, గొడుగు, టోపీ, ఒక లీటర్‌ నీరు వెంట తీసుకు వెళ్లాలి. మాంసాహారం, మసాలా పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ధూమపానం, మద్యం సేవించరాదు. చెమటలు పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింతలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే అది వడదెబ్బ. వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి.

– డాక్టర్‌ బి. రవి, డీఎంహెచ్‌వో, పల్నాడు

Advertisement
 
Advertisement
Advertisement