జాతీయస్థాయి పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా? | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా?

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

జాతీయస్థాయి పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా?

జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా.. ? విద్యార్థులు పగలు, రాత్రి అహర్నిశలు కష్టపడి పరీక్ష రాసిన తరువాత హఠాత్తుగా రద్దు చేయడం వారిలోని మనోధైర్యం, ఆత్మ విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2024లో సైతం ఇదే విధంగా తప్పిదాలు చోటు చేసుకుంటే పరీక్షను రద్దు చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నారు. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన నీట్‌ నిర్వహణలో ఎన్‌టీఏ ఘోరంగా విఫలమైంది. పరీక్ష నిర్వహణ పేరుతో విద్యార్థులకు కఠినమైన ఆంక్షలు విధించి, పరీక్ష నిర్వహణలో ఫెయిలయ్యారు.

– బాదినేని హరిబాబు, ప్రిన్సిపాల్‌, భాష్యం మెడెక్స్‌ కళాశాల, గుంటూరు

Advertisement
 
Advertisement
Advertisement