చిరు వ్యాపారులపై టీడీపీ ప్రతాపం | - | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారులపై టీడీపీ ప్రతాపం

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

పిడుగురాళ్ల రూరల్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, సానుభూతిపరులపై అక్రమ కేసులు పెట్టడం సాధారణమైపోయింది. వారు ఆర్థికంగా నిలబడకుండా చేయటం, వ్యాపారాలను దెబ్బతీయడం పాలకులు, తెలుగుదేశం నాయకులకు లక్ష్యంగా మారింది. అభివృద్ది చేస్తామని అధికారంలోకి వచ్చి పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్న దివ్యాంగులపై ప్రతాపం చూపుతున్నారు. 35 ఏళ్ల నుంచి డ్రైనేజీపై చిరువ్యాపారం చేసే దివ్యాంగులపైకి యంత్రాలను తీసుకొచ్చి మరీ దుకాణాలను తొలగింపజేశారు. మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో అధికార పార్టీ నాయకులు తమ దుర్బుద్ధిని మరోసారి చాటుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు చేయటం, వారి సానుభూతిపరుల వ్యాపారాలు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు.

ఆధారం కోల్పోయిన కుటుంబాలు

గ్రామంలోని షేక్‌ జానీబీ దివ్యాంగురాలు. భర్త కూడా లేరు. 30 సంవత్సరాల నుంచి బొడ్డురాయి సెంటర్‌లో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఆమెకు ఒక కుమార్తె. ఈ కొట్టు మీద వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పమ్మి సైదారెడ్డి చిన్నతనంలో పోలియో బారిన పడ్డారు. 35 సంవత్సరాల నుంచి బొడ్డురాయి సెంటర్‌లో డ్రైనేజీపై చిన్న కొట్టు ఏర్పాటు చేసుకొని గతంలో ఎస్టీడీ బూత్‌ నడిపారు. అనంతరం చిరుతిళ్ల దుకాణం పెట్టుకుస్తున్నారు. బొడ్డురాయి సెంటర్‌ తుమ్మలచెరువు గ్రామంలో ప్రజలందరికీ తెలిసిన ప్రదేశమని, ఆ ప్రాంతంలో ఎన్‌టీఆర్‌ బొమ్మను ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకులు భావించి ఇలా వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను పంపిస్తున్నారని సమాచారం. తమ కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని చెప్పినా టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగి యంత్రాలతో కొట్లనుతొలగించేశారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న

దుకాణాల తొలగింపు

Advertisement
 
Advertisement
Advertisement