గుంటూరు ఎడ్యుకేషన్: యువతకు ఇజ్రాయిల్ దేశంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా ఉపాధి అధికారి ఎం.క్రిస్టీ అభినవ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, వివిధ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో హోం బేస్డ్ కేర్ గివర్ ఇన్ ఇజ్రాయెల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. 25 నుంచి 45 ఏళ్ల వయసు గల పురుష, మహిళా అభ్యర్థులు ఈ అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీడీఏ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతలు కలిగి, ఆంగ్ల భాషా నైపుణ్యంతోపాటు సీఈఎఫ్‌ఆర్ బీ2 గల అభ్యర్థులు అర్హులన్నారు. రెండేళ్లకు కాంట్రాక్ట్ ఒప్పందం ఉంటుందని, నెలకు దాదాపు రూ.1,99,770 వేతనం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు రూ.2.10 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఉంటుందని, అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు శుక్రవారం లోపు https:// nai punyam. ap. gov. in/ user& registration? page= program& registration సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తును https:// skillinternational@apssdc. in సైట్‌కు సైతం పంపించాలని చెప్పారు. వివరాలకు 9988853335, 8712655686, 8790118349, 8790117279 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.


