చిలకలూరిపేటటౌన్(యడ్లపాడు): న్యాయస్థానం పట్ల గౌరవంతో నిబంధనల మేరకు యడ్లపాడు పోలీస్ స్టేషన్‌న్‌లో మాజీ మంత్రి విడదల రజిని ఆదివారం హాజరై సంతకం చేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి వారం స్టేషన్‌న్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉండటంతో, ఈ నెల మూడో తేదీన మొదటి పర్యాయం తర్వాత తిరిగి రెండోసారి ఆమె అధికారుల ముందు హాజరయ్యారు. న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా ప్రతి ఆదివారం ఇదే రీతిన ఆమె స్టేషన్‌కు రానున్నట్లు సమాచారం. రజిని రాకపట్ల పార్టీ నాయకులు, అభిమానులు అఽధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే ఎక్కడా న్యాయస్థాన ఉత్తర్వుల ఉల్లంఘన జరగకుండా, చట్టపరమైన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ స్టేషన్‌లోకి ఒంటరిగా వెళ్లి ఆమె తన హాజరును నమోదు చేశారు. బయటకు వచ్చిన తర్వాత నాయకులు కలిసి ఆమె నివాసానికి వెళ్లా రు. పార్టీ వ్యవహారాలను గురించి రజినితో చర్చించారు.
కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ దరియావలి, చిలకలూరిపేట మండల అధ్యక్షులు దేవినేని శంకరరావు, యడ్లపాడు మండల అధ్యక్షులు వడ్డేపల్లి నరసింహరాజు, ఎస్సీసెల్ జిల్లా నా యకులు పందుల బుల్లెబ్బాయి, నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యులు రాచమంటి చింతారావు, నాయకులు ఉడత వెంకటేశ్వరరావు, కొప్పురావూరి పటేల్, సాపా సైదావలి,తొట్టింపూటి శ్రీను, మైలా రాజేష్, డీలర్ సుభాని, ఊసా రమేష్, ఈ సూబ్‌వలి, తియ్యగూర అంజిరెడ్డి, నర్సింహనాయక్, మానుకొండ శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


