మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోండి

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోండి

నాదెండ్ల మండలం చందవరానికి చెందిన గొర్రపాటి శ్రీనివాసరావు తూబాడుకు చెందిన పురుగుమందుల వ్యాపారి పూదోక నాగేశ్వరరావు వద్ద ఏడాది క్రితం రూ.2.09 లక్షల విలువైన పురుగుమందులు కొనుగోలు చేశారు. ఈనెల నాలుగున నాగేశ్వరరావు శ్రీనివాసరావుపై ఒత్తిడి తీసుకొచ్చి మార్కెట్‌ ధర కంటే తక్కువగా రూ.8.95 లక్షల విలువైన 50 క్వింటాల మిర్చి కొనుగోలు చేశారు. బాకీ రూ.2.63లక్షలు కాగా మిగతా డబ్బులు ఇవ్వమని శ్రీనివాసరావు వ్యాపారిని అడిగినా నకిలీ బిల్లులు చూపించి నీకు దిక్కున్న చోట చెప్పుకోమని అంటున్నాడు. బాధితుడికి న్యాయం చేయండి.

–జి.రామకృష్ణ, కోటనాయక్‌, వై.వెంకటేశ్వరరావు, ప్రజాసంఘాల నాయకులు

Advertisement
 
Advertisement
Advertisement