నరసరావుపేట: ఓటర్ల క్రమబద్ధీకరణ ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించకుండా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) పనిచేయాలని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రామిరెడ్డిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో బీఎల్‌ఏల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చే నెల నుంచి ‘సర్’ ద్వారా ఓటర్ లిస్టుల ప్రక్షాళన మొదలు పెట్టబోతుందని అన్నారు. పార్టీ వారికి చెందిన ఓట్లు తొలగింపునకు గురికాకుండా చూసుకోవాలన్నారు. పార్టీ శ్రేణులు, పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఒక టీంగా ఏర్పడాలని సూచించారు. రాష్ట్ర బూత్ లెవెల్ ఏజెంట్ల కన్వీనర్ రవీంద్రారెడ్డి వీడియా ప్రజంటేషన్ ద్వారా సర్ కార్యక్రమం గురించి వివరించారు. ఎస్‌సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, నరసరావుపేట, రొంపిచర్ల మండలాల కన్వీనర్లు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, తన్నీరు శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గంటెనపాటి గాబ్రియేలు, ఎన్‌కే ఆంజనేయులు, పాలపర్తి వెంకటేశ్వరరావు, కనకా పుల్లారెడ్డి, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, పట్టణ వర్కింగ్ అధ్యక్షుడు అచ్చిశివకోటి, గడ్డం వెంకటరావు పాల్గొన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ...
సత్తెనపల్లి: ‘సర్’పై బూత్ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ జోనల్ ఇన్‌చార్జ్ కందుల రవీంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సదస్సుకు సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అధ్యక్షత వహించారు. నియోజకవర్గ పరిశీలకుడు రేపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి బూత్ కమిటీ సభ్యుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందుగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వలంటీర్ల వింగ్ జిల్లా అధ్యక్షుడు ఎం. ఉమామహేశ్వరరరెడ్డి, జిల్లా బూత్ అధ్యక్షుడు ఇందూరి నరసింహారెడ్డి, నియోజకవర్గ బూత్ అధ్యక్షుడు కాల్వపల్లి బ్రహ్మారెడ్డి వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ మౌలాలి, రాయపాటి పురుషోత్తమ రావు, నక్కా శ్రీనివాసరావు, రాజారపు శివనాగేశ్వరరావు, కొర్లకుంట వెంకటేశ్వర్లు, సయ్యద్ గోరా, మేడ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వాకుమళ్ల చెంచిరెడ్డి, యర్రం పున్నారెడ్డి, రసూల్, ఆదినారాయణ, సాంబ శివరావు పాల్గొన్నారు.
బూత్ లెవెల్ ఏజెంట్లను సమన్వయం
చేసుకొని సర్ నిర్వహించాలి
పార్టీ జిల్లా కార్యనిర్వాహక
అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి
సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ
పార్టీ శ్రేణులకు గజ్జల దిశానిర్దేశం


