ఎవరో చేసిన తప్పిదానికి మాకెందుకు శిక్ష
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.
రాజుపాలెం: పెదనెమలిపురిలోని పోలేరమ్మ తిరునాళ్లను మంగళవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి సారె, బోనాలు సమర్పించారు.
నీట్‌ను రద్దు చేశారని తెలియడంతో విద్యార్థులంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యాం. ఎవరో చేసిన తప్పిదానికి ఒక్క నిర్ణయంతో పరీక్ష మొత్తాన్ని రద్దు చేయడం తగదు. రెండేళ్లపాటు ఎన్నో ఆశలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని పరీక్ష రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రద్దు నిర్ణయం కలచివేసింది. నీట్‌లో 720 మార్కులకు ప్రాథమిక ‘కీ’లో 691 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశించాను. పరీక్ష నిర్వహించే సమయంలో పెట్టిన ఆంక్షలు, శ్రద్ధ పేపర్ లీకేజీ కాకుండా చూడడంలో ఎందుకు పెట్టలేదు.
– వల్లెపు ధీరజ్‌కృష్ణ, విద్యార్థి, గుంటూరు
ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో.. రాత్రనకా.. పగలనకా.. నిద్రాహారాలు మాని.. ఒకరకంగా ప్రాణం పెట్టి నీట్‌కు సిద్ధమయ్యారు.. సమయం కాకముందే కేంద్రాలకు చేరుకుని.. కఠిన ఆంక్షల పరీక్షలను దాటుకుని, పరీక్ష రాసి, హమ్మయ్యా.. అంటూ ఇంటికొచ్చారు.. తమకు రాబోయే ర్యాంకులు తలచుకుంటూ.. ఏఏ కళాశాలలో చేరాలో.. ఎక్కడెక్కడ సీటొస్తుందో నంటూ లెక్కలు వేసుకుంటూ.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నీట్ రద్దంటూ ఎన్‌టీఏ ప్రకటించడంతో విద్యార్థులు హతాశులయ్యారు. భవిష్యత్తుపై గంపెడాశలతో ఉన్న తమకు ఎన్‌టీఏ ప్రకటన శరాఘాత మైందని వాపోతున్నారు. రద్దు ప్రకటన తమ భవిష్యత్తుపై ఖచ్ఛితంగా ప్రభావం చూపుతుందని వ్యథ చెందుతున్నారు. పరీక్ష రోజు కఠిన ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులు లీకేజీ విషయంలో ఎందుకు మిన్నకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
7


