చిలకలూరిపేటటౌన్: పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ సమీపాన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుభానినగర్‌కు చెందిన తాపీమేస్త్రి అయిన షేక్ జానీబాషా గుర్రాల చావిడికి చెందిన వెల్డింగ్ వర్కర్ బషీర్‌ల మధ్య గతంలో కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని సాయికార్తీక్ సిటీ సెంటర్ సమీపంలో గురువారం సాయంత్రం టీ తాగుతున్న క్రమంలో బషీర్ కత్తితో దాడి చేశాడు. బాధితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా పలుచోట్ల కత్తితో పొడిచాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 సిబ్బందికి సమాచారం అందించారు. రక్తస్రావం తీవ్రంగా కావడంతో బాధితుడు బాషాను తొలుత స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడు బషీర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు


