హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ లక్ష్యాలు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ లక్ష్యాలు పూర్తి చేయాలి

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

కారంచేడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ లక్ష్యాలను వైద్య సిబ్బంది ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సీహెచ్‌ రత్నమన్మోహన్‌ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కారంచేడు, దగ్గుబాడు పీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతోపాటు పర్చూరు కో లొకేటడ్‌ పీహెచ్‌సీ వైద్య సిబ్బందితోనూ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీలోగా మీ పీహెచ్‌సీల పరిధిలో ఉన్న 15 ఏళ్లలోపు బాలికలను గుర్తించి వారికి ఈ వ్యాక్సిన్‌ అందించాలన్నారు. బాలికలకు ఈ వ్యాక్సిన్‌ అందించడం వలన కలిగే మేలు తెలియజేయాలని సూచించారు. వ్యాక్సిన్‌ వేయించుకోవడం వలన సర్వైకల్‌ క్యాన్సర్‌నును నివారించుకోవచ్చని ఆయన తెలిపారు. మూడు పీహెచ్‌సీల పరిధిలోనూ చాలా తక్కువ మందికే వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ పృథ్వీరాజ్‌, పర్చూరు కో లోకేటెడ్‌ వైద్యాధికారి డాక్టర్‌ సాయిప్రశాంతి, దగ్గుబాడు పీహెచ్‌సీ వైద్యాఽధికారి డాక్టర్‌ డాక్టర్‌ హరిత, హెల్త్‌ సూపర్‌వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement