భద్రత దైవాధీనం | - | Sakshi
Sakshi News home page

భద్రత దైవాధీనం

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

భద్రత దైవాధీనం ధనలక్ష్మీదేవిగా మహంకాళి అమ్మవారు దర్శనం అన్నపూర్ణాదేవి అలంకారంలో బగళాముఖి అమ్మవారు ఘనంగా లక్ష మల్లెల పూజ సాగర్‌ నీటిమట్టం వివరాలు ఇటీవల జరిగిన ఘటనలు స్టేషన్‌దాకా రాని చోరీలు ఎన్నో.. తాళాలు వేసిన గృహాలే టార్గెట్‌.. ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో భద్రత

న్యూస్‌రీల్‌

రాత్రిళ్లు గస్తీ ఎక్కడ ?

పట్టపగలు దోపిడీతో కలకలం

బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం!

లీజు కాలం ముగిసింది..

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

శ్రీవారి మంత్ర హోమం

దుర్గమ్మకు విరాళాలు

పల్నాడు
సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026

జిల్లాలో కలవరపెడుతున్న

వరుస చోరీలు

కారంపూడి దోపిడీ ఘటన మరువక

ముందే సత్తెనపల్లిలో భారీ చోరీ

తాళాలు వేసిన ఇళ్లే దొంగల టార్గెట్‌

నియంత్రణలో విఫలమవుతున్న

పోలీసులు

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మ వారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి. అమ్మవారు ధనలక్షీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కంఠంరాజుకొండూరు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు.

చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి ఆలయంలో ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఇటీవల వైభవంగా జరిగిన నేపఽఽథ్యంలో భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ట్రస్ట్‌ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన మహాన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయ ప్రాంగణంలో తిరునాళ్ల సందడి నెలకొంది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పట్నంబజారు: గుంటూరు నగరంలోని నాజ్‌ సెంటర్లో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమత్‌ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం లక్ష మల్లెల పూజ నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, కార్యనిర్వాహణాధికారి టి.సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్‌ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు తిరువల్లూరి వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి లక్ష మల్లెలతో పూజలు నిర్వహించటంతోపాటు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారు సువర్చలా సమేత ఆంజనేయస్వామిగా నగర పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం 8:30 గంటలకు వందలాది మంది భక్తులు, ఆంజనేయ దీక్షాపరులతో హనుమాన్‌ చాలీసా పారాయణం 108సార్లు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అయినవోలు నరసింహచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్‌ దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సిహెచ్‌ రమేష్‌, మారుతి, వెంకటరమణ, బాపిరాజు, కిషోర్‌, పాలక మండల సభ్యులు పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.70 అడుగులకు చేరింది. ఇది 157.9860 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

నరసరావుపేట టౌన్‌: పల్నాడు జిల్లాలో వరుస చోరీలు ప్రజలను కలవర పెడుతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో నిత్యం దొంగతనం కేసులు నమోదు అవుతుండటం ప్రజల్లో భద్రతపై ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు దోచుకువెళ్తున్నారు. పార్క్‌ చేసిన వాహనాలు క్షణాల్లో మాయమవుతున్నాయి.

● జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో 20 రోజుల క్రితం ప్రకాష్‌నగర్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయం వెనుక ప్రాంతంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. యలవర్తి రాంప్రసాద్‌ కుటుంబ సభ్యులతో షిరిడీ యాత్రకు వెళ్లి వచ్చేలోపు ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోకి చొరబడిన దుండగులు రెండు బీరువాలను ధ్వంసం చేసి అందులోని విలువైన వస్తువులను అపహరించుకు వెళ్లారు.

● తాజాగా మూడు రోజుల క్రితం సత్తెనపల్లిలో రెండు బంగారు దుకాణాల్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. గొళ్లమూడివారి వీధిలోని నాగలక్ష్మీ జ్యూయలర్స్‌, శ్రీకృష్ణా డైమండ్‌ హాల్‌ జ్యూయలర్స్‌ దుకాణాల్లో తాళాలు పగులగొట్టి రూ.8 లక్షల విలువైన మూడు కిలోల వెండి వస్తువులను అపహరించుకు వెళ్లారు. మరో దుకాణంలో తాళాలు పగులగొట్టి చోరీకి విఫల యత్నం చేశారు. ఈ ఘటన వ్యాపార వర్గాల్లో తీవ్ర భయాందోళన రేకెత్తించింది.

● నెల రోజుల క్రితం సత్తెనపల్లి మార్కెట్‌ యార్డు కార్యాలయ తాళాలు పగులగొట్టి ఆఫీస్‌లోని విలువైన వస్తువులు అపహరించుకు వెళ్లారు. సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో సత్తెనపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అయినప్పటికీ చోరీల పరంపరకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు.

జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో చిన్నపాటి దొంగతనాలు చోటుచేసుకోవటం పరిపాటిగా మారింది. చోరీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని అయితే పోలీస్‌ స్టేషన్‌ల దాకా వెళ్లని సంఘటనలు అనేకం ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పోయిన సొమ్ము తిరిగి వస్తుందన్న నమ్మకం లేక చాలా మంది ఫిర్యాదు చేయటానికి వెనకడుగు వేస్తున్నారన్నా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నపాటి చోరీలను బాధితులు మౌనంగా భరించాల్సి వస్తుంది. ఇటీవల వినుకొండ దక్షిణం బజారుకు చెందిన అడ్డగిరి లక్ష్మి మెడలో బంగారపు గొలుసును పట్టపగలు లాక్కెళ్లారు. అడ్డువచ్చిన భర్త కొండయ్య కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడి పరారీ అయ్యారు. ఇలా ఒంటరిగా నడిచి వెళ్లే మహిళల మెడల్లో ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు నానుతాడులు లాక్కువెళ్లటం వంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అనేకం చోటుచేసుకున్నాయి.

పగలు ప్రాంతాలను పరిశీలిస్తూ తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలను గుర్తిస్తున్న దొంగలు రాత్రి వేళ వాటిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు తెగబడుతున్నారు. రోజుల తరబడి తాళం వేసి ఉంటే అటువంటి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో పాటు ఇంటికి తాళాలు వేయకుండా ఆరుబయట నిద్రించే ఇళ్లపై దొంగలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కొందరు దొంగలు సీసీ కెమెరాలకు సైతం దొరకకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ముఖాలకు మాస్క్‌లు, టోపీలు ధరించి కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. దీంతో దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నా నిందితులను గుర్తించటం సవాల్‌గా మారింది.

లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) తో పోలీస్‌ శాఖ ఇళ్లకు సాంకేతిక భద్రత ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వెళ్తే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలి. ఆ ఇంటిని పోలీసులు ఆన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షిస్తారు. ఈ విధానం ఇళ్లకు రక్షణ కవచంలా నిలుస్తోంది. ఆన్‌లైన్‌ యాప్‌ సిస్టమ్‌లో అభ్యర్థిస్తే పోలీస్‌ సిబ్బంది ఇంటికి వచ్చి ఆ సౌకర్యాన్ని అమర్చుతారు. ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు ఈ ఉచిత సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

సత్తెనపల్లిలో చోరీ జరిగిన బంగారు ఆభరణాల దుకాణం

బల్లవంతపు వసూలు!

యడ్లపాడు: సాధారణంగా వి ద్యార్థి దశ అంటే పుస్తకాలు, పరీక్షలు, మార్కుల చుట్టూనే తిరుగుతుంది. కానీ, కొందరు మాత్రం చదువుతోపాటు ఒక ప్రత్యేక కళను ప్రాణంగా ప్రే మిస్తారు. ఆ ప్రేమే వారిని ప దిమంది ప్రేమించేలా.. ప్రశంసల్ని పొందేలా చేస్తుంది. ఇందుకు యడ్లపాడు మండలం చారిత్రక ప్రాంతమైన కొండవీడుకు చెందిన షేక్‌ సనా కౌసర్‌ను చక్కని ఉదాహరణ.

కుంచె లేని అక్షర చిత్రకారిణి

ఆటో డ్రైవర్‌ రషీద్‌, ఫాతిమా దంపతులకు ఇద్దరు సంతానంలో చిన్న కుమార్తె కౌసర్‌. పేద కుటుంబమే అయినా, పేదరికానికి ప్రతిభకు సంబంధం లేదని ఈ బాలిక నిరూపించింది. స్వభావరీత్యా బిడియం ఎక్కువే అయినా, ఆమె అక్షరాల్లో మాత్రం అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. పీఎంశ్రీ జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలోని మోడల్‌ ప్రైమరీ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన కౌసర్‌, తన చేతిరాతతో చిత్రకారుడినే తలపిస్తోంది. ముంబాయికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్‌ సాధించి, ‘అక్షరం’ అంటే సమాచారం కాదు, అది ఒక ‘అలంకారం’ అని చాటిచెప్పింది

శిష్యరికం నుంచి శిక్షణ వరకు..

తన గురువు డాక్టర్‌ షేక్‌ జున్ను మాస్టర్‌ పర్యవేక్షణలో లుసిడా, ప్రింట్‌ హ్యాండ్‌ రైటింగ్‌లో ఏడాది పాటు కఠోర సాధన చేసింది. కేవలం నేర్చుకోవడానికే పరిమితం కాలేదు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి పంచాలనే తపనతో యడ్లపాడులో బాసట ఆధ్వర్యంలో జరిగే ఉచిత వేసవి శిబిరంలో 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు 43 మందికి హ్యాండ్‌ రైటింగ్‌పై శిక్షణ ఇచ్చింది. తనకంటే పెద్దవారైన టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులకు సైతం అక్షరాల మెలకువలు నేర్పిస్తూ ‘చిన్నారి గురువు’గా నీరాజనాలు అందుకుంటోంది. కౌసర్‌ ప్రతిభను గుర్తించిన బాసట సామాజిక సంస్థ, గురువు సరసన బాలికను కూర్చోబెట్టి ఘనంగా సత్కరించడం కౌసర్‌ పట్టుదలకు దక్కిన గౌరవం.

గురుశిష్యులను సత్కరిస్తున్న బాసట స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు

7

వేసవి సెలవులు రావటంతో పుణ్యక్షేత్రాలు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఉక్కపోతకు ఆరుబయట, డాబాలపై నిద్రించే వారు ఉన్నారు. ఇదే అదునుగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా రాత్రిళ్లు గస్తీ బలహీనంగా ఉందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పోలీస్‌ అధికారులు దొంగతనాల నియంత్రణపై దృష్టి సారించి రాత్రిళ్లు గస్తీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాత నేరస్తుల కథలికలపై నిఘా ఉంచటంతో పాటు అనుమానితులపై పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

కారంపూడిలో పట్టపగలు వ్యక్తి పై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకువెళ్లిన సంఘటన వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. గత నెల 27వ తేదీన వినుకొండకు చెందిన యక్కల శ్రీనివాసరావు కారంపూడిలో బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వచ్చాడు. అతనిని అడ్డగించి ద్విచక్రవాహనంపై వచ్చిన ఆరుగురు నిందితులు రూ.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకొని వెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల నిందితులను అరెస్ట్‌ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

కౌసర్‌ సాధించిన విజయం చిన్నదే కాని, మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. ప్రతి విద్యార్థిలో నూ ఒక ప్రత్యేకమైన సృజనాత్మకత, నైపుణ్యం దాగి ఉంటాయి. చిన్న వయసులోనే పిల్లల ఆలోచనలను, వారిలోని సహజ సిద్ధమైన అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి. తమకు నచ్చిన కళలను నేర్చుకునే అవకాశం కల్పిస్తే అది వారిలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందుతుంది. తల్లిదండ్రులు ఈ దిశగా ఆలోచన చేయాలి. పిల్లల అభిరుచులను గుర్తించి వెన్నుతట్టాలి. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా కళల్లో నిష్ణాతులుగా ఎదిగేలా ప్రాథమిక స్థాయి నుంచే కృషి జరగాలి. అప్పుడే జీవితంలో వారు గొప్పగా రాణించగలుగుతారు.

లీజు కాలం మార్చి 30తోనే ముగిసిన మాట వాస్తవం. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో బహిరంగ వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. పాట దారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదాలు పడ్డా యి. తిరిగి నిర్వహిస్తాం. అప్పటివరకు కృష్ణానదిపై పడవలు, బల్లకట్టు నడపడం నేరం. దీనిపై తనిఖీలు నిర్వహించి నదిపై నడిచే వాహనాలను సీజ్‌ చేస్తాం.

– కోయ శ్రీనివాసరావు,

ఎంపీడీఓ, అచ్చంపేట

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు.

వినుకొండ: వినుకొండ శ్రీనివాసనగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష గోవింద నామ పారాయణం, శ్రీవారి మంత్ర హోమం నిర్వహించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపవ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి తెనాలి గాంధీనగర్‌కు చెందిన కె.మాధవరావు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement