జిల్లా స్విమ్మింగ్‌ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా స్విమ్మింగ్‌ జట్టు ఎంపిక

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

జిల్లా స్విమ్మింగ్‌ జట్టు ఎంపిక

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీసుబ్బరాయ అండ్‌నారాయణ కళాశాల స్విమ్మింగ్‌ పూల్‌లో జిల్లా సీనియర్‌ స్విమ్మింగ్‌ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలో 20 మంది స్విమ్మర్లు పాల్గొనగా వారిలో 8 మందిని వివిధ కేటగిరిలలో జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు అసోసియేషన్‌ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఎంపికై న జట్టు ఈనెల 24వ తేదీన కర్నూలులోని డిఎస్‌ఏ స్టేడియం స్విమ్మింగ్‌ పూల్‌లో నిర్వహించనున్న 12వ సీనియర్‌ అంతర్‌ జిల్లాల స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రామలింగారెడ్డి, కోచ్‌ జి.సురేష్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement