డాక్టర్ల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ శ్రీనివాసులు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్ల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ శ్రీనివాసులు

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

డాక్టర్ల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ శ్రీనివాసులు రాష్ట్రంలో త్వరలో మినీ మార్టులు తెనాలిఅర్బన్‌: రాష్ట్రంలోని కొన్ని రేషన్‌ షాపులను మినీ మార్ట్స్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. తెనాలిలో బుధవారం పింఛన్‌ పంపిణీదారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో పండించిన వస్తువులను అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్‌ అందజేస్తామని చెప్పారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జేఆర్‌ అప్పలనాయుడు, తహసీల్దార్‌ గోపాలకృష్ణ, డీఎస్పీ జనార్ధనరావు, ఎంపీడీఓ అత్తోట దీప్తి పాల్గొన్నారు. అమృతలూరు పీహెచ్‌సీకి కేంద్రప్రభుత్వ గుర్తింపు

గుంటూరు మెడికల్‌: గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ దాసరి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, టీబీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శిగా దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఇజాజ్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా డాక్టర్‌ గుడిసె చంద్రశేఖర్‌, కేంద్ర ఎన్నికల పరిశీలకుడిగా డాక్టర్‌ ఇంజేటి బాబ్జిశ్యామ్‌కుమార్‌ వ్యవహరించారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను గుంటూరు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్‌ స్వరూప్‌కాంత్‌, డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు పాల్గొన్నారు

మంత్రి నాదెండ్ల మనోహర్‌

వేమూరు: అమృతలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు అందించడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్‌ పాలడుగు శృతి తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ నాణ్యత ప్రమాణాల హామీ బృందం సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్‌ 27 28 తేదీల్లో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అందించే వైద్య సేవలు, కాన్పుల విభాగం పనితీరు, లేబొరేటరీ పనితీరును పరిశీలించారన్నారు. అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన బృంద సభ్యులు, బుధవారం గుర్తింపు పత్రం అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది డాక్టర్‌ శృతిని అభినందించారు. ఆరోగ్య విస్తరణాధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్ట గుంట శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement