మంచి వేడుకలాంటి సినిమా | Sree Vishnu Super Fun Speech At Vishnu Vinyasam Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

మంచి వేడుకలాంటి సినిమా

Feb 19 2026 5:12 AM | Updated on Feb 19 2026 5:12 AM

Sree Vishnu Super Fun Speech At Vishnu Vinyasam Movie Teaser Launch

– శ్రీ విష్ణు

‘‘విష్ణు విన్యాసం’ మూవీ ఫస్ట్‌ హాఫ్‌కి యువత పిచ్చిపిచ్చిగా కనెక్ట్‌ అవుతారు. సెకండ్‌ హాఫ్‌ ఫ్యామిలీస్‌కి విపరీతంగా నచ్చుతుంది. చివరి 15 నిమిషాలు కుర్రాళ్లకి, కుటుంబ సభ్యులకూ నచ్చుతుంది. మంచి వేడుకలాంటి సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అని హీరో శ్రీ విష్ణు తెలిపారు. యదునాథ్‌ మారుతీ రావు దర్శకత్వంలో శ్రీ విష్ణు, నయన సారిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’.

 హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు .జి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్‌ కానుంది. బుధవారం నిర్వహించిన ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘ఒంగోలు నేపథ్యంలో మారుతీ రావుగారు ఈ మూవీ తీశారు. 28న అందరూ ఫ్యామిలీతో థియేటర్స్‌కి వెళ్లండి. మీ అందరికీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఇది మామూలుగా ఉండే ప్రేమకథ కాదు. 

చాలా మలుపులు ఉన్నాయి. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు నయన సారిక. ‘‘విష్ణుగారి నుంచి ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి’’ అని యదునాథ్‌ మారుతీ రావు చె΄్పారు. ‘‘ఫ్యామిలీతో వచ్చి మా విష్ణు చేసే విన్యాసాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుమంత్‌ నాయుడు .జి. ఈ కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ రధన్‌ మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement