మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తీస్తున్న సినిమా 'వారణాసి'. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించి టైటిల్ అనౌన్స్ చేశారు. 2027లోనే రిలీజ్ ఉంటుందని అన్నట్లు చెప్పుకొచ్చారు. రాజమౌళి మూవీ అంటే చెప్పిన సమయానికి ఎప్పుడు రాదు. తెలుగు ప్రేక్షకులకు ఇది తెలుసు. దీంతో ఈ చిత్రం కూడా 2027లో రావడం సందేహామే అని చాలామంది అనుకుంటున్నారు. దీంతో టీమ్ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది.
(ఇదీ చదవండి: వాళ్లతో సినిమాలు.. ప్రభాస్‌కి అస్సలు అచ్చిరాలేదు!)
2027లోనే 'వారణాసి' రిలీజ్ అవుతుందని టీమ్ ఇప్పుడు ట్వీట్ చేసింది. తద్వారా మరోసారి క్లారిటీ ఇచ్చినట్లయింది. చాలామంది ఉగాది లేదా శ్రీరామనవమి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చని అనుకుంటున్నారు. ఈ రెండు పండగలు అంటే మరో ఏడాది మాత్రమే టైమ్ ఉంది. అప్పట్లో రాజమౌళి, సినిమాని సిద్ధం చేస్తారా అనేది చూడాలి? మహేశ్ అభిమానులు, చాలామంది నెటిజన్లు మాత్రం 2027లోనే రిలీజ్ అంటే అస్సలు నమ్మట్లేదు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ కామెంట్స్ పెడుతున్నారు.
మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లు కాగా.. 'వారణాసి'లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ విలన్‌గా చేస్తున్నాడు. ఇందులో కాసేపు మహేశ్ రాముడి పాత్రలోనూ కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే బయటపెట్టాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం.
(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)
COMING IN 2027.#VARANASI pic.twitter.com/yuInvgJwIk
— Varanasi (@VaranasiMovie) January 21, 2026


