సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ శివారులో 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. దాదాపు మూడున్నర నిమిషాల పాటు సాగిన ఈ వీడియో అద్భుతమనే రేంజులో ఉంది. ఆ విజువల్స్, గ్రాఫిక్స్ మతిపోగొట్టేలా కనిపించాయి.
వారణాసి 512సీఈ నుంచి మొదలుపెట్టి.. ఆస్టరాయిడ్ శంభవి 2027సీఈ.. అంటార్కిటికా ఆఫ్రికా.. ఉగ్రభట్టి గుహ.. లంకా నగరం త్రేతాయుగం.. వారణాసి మణికర్ణిక ఘాట్.. అంటూ చూపించారు. చివర్లో మహేశ్ బాబు ఎద్దుపై స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలంతో కనిపించారు. చివరలో 'వారణాసి' అనే టైటిల్ పడింది. 3 నిమిషాల 40 సెకన్ల వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేదు. అయినా సరే విజువల్ వండర్ అనేలా తీర్చిదిద్దారు.


