Meera Nandan
-
‘జై బోలో తెలంగాణ’ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
మీరా నందన్.. ఈ పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ, 'జై బోలో తెలంగాణ' హీరోయిన్ అంటే మాత్రం అందరూ గుర్తు పట్టేస్తారు. 2011లో విడుదలైన ఆ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అందులో తెలంగాణ యువకుడిని ప్రేమించే ఆంధ్రా అమ్మాయిగా మీనా నందన్ నటించి, మెప్పించింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ఆ సినిమా రిలీజ్ తర్వాత మీరా నందన్‌కి వరుస అవకాశాలు వచ్చాయి. మీరా నందన్ మాత్రం చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేసింది.కొన్నాళ్ల తర్వాత మలాయళంలో కొన్ని టీవీ షోస్ కూడా చేసింది. సినిమాల్లోకి వచ్చే ముందు మోడల్‌గానూ చేసింది.2008లో ‘ముల్లా’ అనే మూవీతో హీరోయన్‌గా మారింది. ‘వాల్మీకి’ అనే సినిమాతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత తమిళ్లో వరుస అవకాశాలు వచ్చాయి. 'జై బోలో తెలంగాణ' తర్వాత తెలుగులోనూ వరుస చాన్స్‌లు వచ్చాయి. కానీ మీరానందన్ ఆసక్తి చూపించలేదు. అంతేకాదు కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే 2014లో 2024లో తన బాయ్‌ఫ్రెండ్, అకౌంటెంట్ శ్రీజుని వివాహం చేసుకుంది.పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చి, తన మకాంను దుబాయ్‌కి మార్చింది. ప్రస్తుతం ఆమె అక్కడ ఒక ప్రముఖ మలయాళ రేడియో స్టేషన్లో రేడియో జాకీ పనిచేస్తున్నారు. రేడియో రంగంపై ఉన్న ఆసక్తితోనే ఆమె సినిమాలను పక్కన పెట్టి ఈ వృత్తిని ఎంచుకున్నట్లు సమాచారం.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ట్రావెల్ ఫోటోలను, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సినిమాల్లో నటించకపోయినా, తనదైన శైలిలో అభిమానులకు చేరువగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. View this post on Instagram A post shared by Meera Nandhaa (@nandan_meera) -
Meera Nandan: హీరోయిన్ పెళ్లి.. భర్తతో స్పెషల్ షూట్ (ఫోటోలు)
-
'జై బోలో తెలంగాణ' హీరోయిన్ పెళ్లి (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. సింపుల్‌గా గుడిలో ఏడడుగులు వేసింది. శనివారం ఉదయమే జరిగిన ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం ఈ నటి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)మలయాళ బ్యూటీ మీరా నందన్.. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సింగర్ అయింది. 2008లో ఈమెకు సొంత భాషలో తొలి అవకాశమొచ్చింది. అనంతరం తమిళ, తెలుగు, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో 'జై బోలో తెలంగాణ', హితుడు, 4th డిగ్రీ తదితర చిత్రాల్లో యాక్ట్ చేసింది. వీటిలో 'జై బోలో తెలంగాణ'తో ఈమెకు హిట్ దక్కినా ప్రయోజనం లేకుండా పోయింది.గతేడాది 'ఎన్నలుమ్ ఎంటే ఆలియా' అనే మలయాళ సినిమాలో చివరగా నటించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. ఇప్పుడు శ్రీజు అనే యూకేకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ని పెళ్లి చేసుకుంది. ప్రముఖ గురువాయుర్ దేవాలయంలో వీళ్లు ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని మీరానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?) View this post on Instagram A post shared by Meera Nandhaa (@nandan_meera) -
సున్నితమైన ప్రేమకథ
జగపతిబాబు, మలయాళ నటి మీరా నందన్ జంటగా 2015లో విడుదలైన చిత్రం ‘హితుడు’. కె.విప్లవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నంది అవార్డు కూడా పొందింది. విప్లవ్ తాజాగా కొత్త సినిమాని తెరకెక్కించనున్నారు. కేఎస్వీ సమర్పణలో సిరంజ్ సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ‘ప్రేమకు రెయిన్ చెక్’ ఫేమ్ అభిలాష్, ‘అరవింద సమేత వీర రాఘవ, మిస్టర్ మజ్ను’ చిత్రాల్లో నటించిన రాఘవ్ కథానాయకులు. విప్లవ్ మాట్లాడుతూ– ‘‘సున్నితమైన ప్రేమకథతో నిర్మించనున్న చిత్రమిది. నేటి తరం యువత జీవనశైలికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తి కావచ్చాయి’’ అన్నారు. -
శరత్‌కుమార్‌తో మీరానందన్
వాల్మీకి ఫేమ్ మీరానందన్ గుర్తుందా? మలయాళంలో మోహన్‌లాల్ వంటి స్టార్ హీరో సరసన నటించి ప్రాచుర్యం పొందిన ఈ కేరళ కుట్టి కోలీవుడ్ కంట పడ్డారు. ఇంకేముంది వాల్మీకి చిత్రంలో హీరోయిన్ అయిపోయారు. ఆ తరువాత అయ్యనార్, కాదలుక్కు మరణమిల్లై, సూర్య నగరం వంటి చిత్రాలలో నటించినా సరైన హిట్స్ లేకపోవడంతో ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించలేదు. టాలీవుడ్ బై భోలో తెలంగాణ చిత్రంలో మెరిశారు. అలాంటి మీరానందన్ తాజాగా కోలీవుడ్‌కు తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు. శరత్‌కుమార్ హీరోగా విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్న చండమారుదం చిత్రంలో నటిస్తున్నారు. మ్యూజిక్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్గా ఓవియ నటిస్తున్నారు. ఈ చిత్రానికి శరత్‌కుమార్ కథ, కథనం, సమకూర్చడంతో పాటు సంభాషణలు రాయడం మరో విశేషం. -
‘సింధూరపువ్వు’... ఓ థ్రిల్లర్!
రమేష్, మీరానందన్ జంటగా శ్రీ లక్ష్మీసింధు క్రియేషన్స్ పతాకంపై పుల్లేటి దుర్గామోహన్ నిర్మించనున్న చిత్రం ‘సింధూరపువ్వు’. మల్లా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ని త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ప్రేమ ప్రధానంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇందులో మెయిన్ విలన్‌గా రాజీవ్ కనకాల, మలేసియన్ పోలీసాఫీసర్ పాత్రను రవిబాబు చేయనున్నారు. సింగపూర్, మలేసియాల్లో సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. హాలీవుడ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం’’ అని చెప్పారు. ఎమ్మెస్, పృథ్వీ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: విశ్వ, సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, సమర్పణ: జన్యావుల శేషయ్య, సహ నిర్మాతలు: ఎస్. భాను, మజ్జి రమేష్.


