తిరుమల.: వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి నేడు(గురువారం, నవంబర్ 27 వ తేదీ) వైకుంట ద్వార దర్శన టికెట్ల విడుదల చేయనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు నుండి ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్టేషన్‌కు అవకాశం కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తొలి మూడు రోజులకు దర్శన టోకెన్ల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. .డిసెంబర్ 1వ తేదీ వరకు ...5 రోజుల పాటు టీటీడీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, ప్రభుత్వ WhatsApp సర్వీసెస్ ద్వారా నమోదుకు అవకాశం కల్పించనుననారు. ఈ-డిప్ లో టోకన్ పొందిన భక్తులకు డిసెంబర్ 2వ తేదీన సందేశం వస్తుంది.
.డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి, 31 ద్వాదశి, జనవరి1 న త్రయోదశి రోజులలో టికెట్లు ఉన్న వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పిస్తారు. దీనిలో భాగంగా .జనవరి 2 నుండి 8 తేది వరకు సర్వదర్శనంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8 తేది వరకు ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు.


