గూడు కొట్టిన కక్ష!
టీడీపీ నేతల కుట్రలకు రెవెన్యూ అధికారుల సహకారం నిరంకుశంగా 30 నివాసాలు నేలమట్టం మరో ముప్పై ఆవాసాలను సైతం కూల్చేందుకు యత్నం
బడుగుజీవులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టింది. ప్రధానంగా శ్రీకాళహస్తి నియోజకవర్గలో పేదల ఇళ్లపై పచ్చమూక ప్రతాపం చూపిస్తోంది. కష్టపడి కట్టుకున్న ఇళ్లను నిలువునా కూల్చేస్తోంది. ఇందుకోసం అధికారులను పావులుగా వాడుకుంటోది. ఈ క్రమంలోనే రేణిగుంట మండలం కొత్తపాళెంలో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు చెందిన 30 నివాసాలను నిర్ధాక్షిణ్యంగా నేలమట్ట చేసేసింది. మరో ముప్పై గృహాలను కూలగొట్టేందుకు సన్నద్ధమవుతోంది.
జేసీబీతో ఇళ్లను తొలగిస్తున్న దృశ్యం
రేణిగుంట : చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదల ఇళ్లను కూల్చడమే అజెండాగా టీడీపీ నేతలు పెట్టుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి అనుకున్న పనులు చేసేస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం రేణిగుంట మండలం కొత్తపాళెంలోని సర్వేనంబర్లు 187/11 , 188/1 భూమిలో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చేశారు. వాస్తవానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 60 మంది పేదలు ఆ భూమిలో రేకుల ఇళ్లు నిర్మించుకున్నారు. వీరికి అప్పటి తహసీల్దార్ అనుభవ పట్టా సైతం మంజూరు చేశారు. దీంతో ఆ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. ఏటా పంచాయతీకి ఇంటి పన్ను సైతం చెల్లిస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతల కన్ను ఈ భూమిపై పడింది. వెంటనే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి మొదలుపెట్టారు. దీంతో రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. ముందుగా 30 ఇళ్లను ఎంపిక చేసుకుని విద్యుత్ సరఫరా కట్ చేయించి మీటర్లను తొలగింపజేశారు. జేసీబీతో ఇళ్లను కూల్చివేశారు.
చీకటి పడినా కొనసాగిన విధ్వంసం
జేసీబీని అడ్డుకునేందుకు యత్నిస్తున్న మహిళ
నిరుపేదల ఇళ్లపై పచ్చమూక ప్రతాపం
గూడు కొట్టిన కక్ష!
గూడు కొట్టిన కక్ష!


