అంబేడ్కర్ సేవలు అమరం
వరదయ్యపాళెం : దేశానికి దిశా నిర్దేశం చేసిన అంబేడ్కర్ సేవలు అమరమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. బుధవారం మండలంలోని కంచరపాళానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బందిల బాలయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు బందిల సురేష్, కుమార్తె షర్మిల, శివయ్య దంపతులు గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌తో కలిసి ఆవిష్కరించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో బాలయ్య తనవెంట నడిచారని, ఆయన జ్ఞాపకార్థం రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిచడం సంతోషంగా ఉందన్నారు. భూమన మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని బాలయ్య కుటుంబీకులు ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.


