బాధ్యత తీసుకుని.. | - | Sakshi
Sakshi News home page

బాధ్యత తీసుకుని..

Nov 27 2025 5:58 AM | Updated on Nov 27 2025 6:00 AM

అధికారంలోకి రాగానే విపత్తు

నష్టాలన్నింటినీ తీరుస్తాం

వెయ్యి ఇళ్లతో నూతన కాలనీ నిర్మిస్తాం

అధినేత వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో

బృహత్తర పనులు చేపడతాం

కళత్తూరు, పాతపాళెం వాసులకు

అండగా ఉంటాం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ గురుమూర్తి

ముంపు బాధితులకు 650 ఫ్యాన్లు పంపిణీ

‘‘రాయలచెరువుకు గండి పడిన ఘటనలో ముంపు బాధితులకు అండగా నిలుస్తాం. కళత్తూరు.. పాతపాళెం వాసుల కష్టాలు తీరుస్తాం. గ్రామాలను మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. అందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తాం. వెయ్యి గృహాలతో నూతన కాలనీని నిర్మిస్తాం. సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కారు పూర్తిగా వైఫల్యం చెందింది. కొండంత నష్టాని గోరంత సాయం అందించి చేతులు దులిపేసుకుంది’’ అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ గురుమూర్తి, పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌తో కలిసి ముంపు గ్రామాల్లో బుధవారం పర్యటించారు. క్షేత్రస్థాయిలో బాధితులను పరామర్శించి భరోసా కల్పించారు.

కళత్తూరు దళితవాడలో ఫ్యాన్లు పంపిణీ చేస్తున్న పెద్దిరెడ్డి, ఎంపీ గురుమూర్తి

వరదయ్యపాళెం : మరో మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రానుందని, వెంటనే రాయలచెరువు ముంపునకు గురైన కళత్తూరు దళితవాడ, పాతపాళెం గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేయించే బాధ్యత నాది అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎంపీ గురుమూర్తి, వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌తో కలసి కేవీబీపురం మండలంలోని కళత్తూరు దళితవాడలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి కష్టనష్టాలను ఆరా తీశారు. గ్రామస్తులు మాట్లాడుతూ వందలాది పశువులు, గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయని, 2వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయని, రాళ్లురప్పలతో నిండి వ్యవసాయానికి యోగ్యత లేకుండా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ప్రతి ఇంట్లో రూ. లక్ష పైగా విలువ చేసే ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర వస్తువులు కొట్టుకుపోయాయని వాపోయారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ బాధితులకు నష్ట పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అయితే పేదల ఇబ్బందులు చంద్రబాబు సర్కారుకు ఏ మాత్రం పట్టవని, అందుకే ఇంతటి విపత్తుకు తూతూమంత్రంగా సాయం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం జరిగిన నష్టాలను మూడేళ్లలో రానున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పూర్తిగా తీరుస్తామని, అది తన బాధ్యతని, ఆ మేరకు మీకు మాట ఇస్తున్నానని స్పష్టం చేశారు.

ఫ్యాన్లు పంపిణీ

కళత్తూరు దళితవాడ, పాతపాళెంలోని ముంపు బాధిత కుటుంబాలకు ఒక్కో సిలింగ్‌ ఫ్యాను చొప్పున 650 ఫ్యాన్లను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ, మండల అధ్యక్షులు గవర్ల కృష్ణయ్య (కేవీబీపురం), చలపతిరాజు (పిచ్చాటూరు), అపరంజిరాజు (నాగలాపురం), ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షులు బొర్రా మాధవి రెడ్డి, సురుటుపల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ ఏవీఎం మునిశేఖర్‌ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డేవిడ్‌, పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి జేబీఆర్‌ మునిరత్నం, వాణిజ్య సహాయక కార్యదర్శి అన్నాదొరై, సంయుక్త కార్యదర్శి కేవీ భాస్కర్‌ నాయుడు, జిల్లా క్రియాశీలక కార్యదర్శి రాకేష్‌ కిరణ్‌, ఎంపీపీలు నందకుమార్‌, దివాకర్‌ రెడ్డి, హరిశ్చంద్రారెడ్డి, శ్యామ్‌, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తరిణి ధనంజయరెడ్డి, కార్యదర్శి లాల్‌బాబు యాదవ్‌, జెడ్పీటీసీ సభ్యులు మునెమ్మ, వైస్‌ ఎంపీపీ సరస్వతి, పార్టీ నియోజకవర్గ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ ప్రసాద్‌రెడ్డి, స్థానిక నేతలు దశరథరామిరెడ్డి, రమేష్‌, అరుణాచలం, ప్రశాంత్‌, రాంకీ, ఆరువేలు పాల్గొన్నారు.

మూడేళ్ల తర్వాత వచ్చేది

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే

సమస్యలన్నీ పరిష్కరిస్తాం

లోతట్టు ప్రాంతంలో దళితవాడ ఉన్న కారణంగా పూర్తిగా మునిగిపోయినట్లు గ్రామస్తులు తన దృష్టికి తెచ్చారని, మన ప్రభుత్వం రాగానే మిట్ట ప్రాంతంలో నూతన కాలనీ ఏర్పాటు చేయిస్తామన్నారు. వెయ్యి ఇళ్లు నిర్మించి పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే ఏళ్లతరబడి ఇంటి స్థలాలకు సంబంఽధించి వివాదంగా మారిన అటవీ భూముల సమస్యలన్నీ పరిష్కరిస్తామని వివరించారు. ఈ విపత్తు నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరారు. అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రమాదం సంభవిచంఇన గంటల వ్యవధిలోనే పార్టీ శ్రేణులు స్పందించి తమవంతు సాయం చేశారన్నారు. వారి స్పూర్తితోనే తనవంతుగా విషయం తెలిసిన గంటలోనే ఎంపీ నిధుల నుంచి రూ. 20లక్షలను తక్షణ సాయంగా మంజూరు చేసినట్లు వెల్లడించారు. తర్వాత మరో రూ. కోటి కేటాయించినట్లు తెలిపారు. అలాగే నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వివరించారు. ప్రతి నష్టానికి పరిహారం వచ్చేంత వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. నూకతోటి రాజేష్‌ మాట్లాడుతూ ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రమాదం జరిగిన రోజు నుంచి నేటి వరకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు.

బాధ్యత తీసుకుని..1
1/2

బాధ్యత తీసుకుని..

బాధ్యత తీసుకుని..2
2/2

బాధ్యత తీసుకుని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement