తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా తిరుమల నెయ్యి విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారన్నారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేయబోయే ర్యాలీలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
బోలేబాబా సప్లై చేస్తున్న నేయిలో ప్రమాణాలు లేవని వచ్చిన పిర్యాదుపై పరిశీలన జరిపి, ఆ కంపెనీని బ్లాక్‌చేయించింది వైవీ. సుబ్బారెడ్డి అని,. ఇప్పుడు అలాంటి సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తున్నారన్నారు. కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకునే ఇవన్నీ చేస్తున్నారన్నారు.
కూటమి ప్రభుత్వం రాద్దాంతంపై సజ్జల సంధించిన ప్రశ్నలు..
రిమాండ్ రిపోర్టు చూస్తే 2024లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ రెండో వారంలో ధర్మారెడ్డిని మీరు తొలగిచిన తర్వాత, వెంటనే శ్యామలరావును పెట్టుకున్నారు. ఇది జరిగిన తర్వాత జులై మొదటివారంలో ట్యాంకర్లలో వచ్చిన నేయిని పరీక్షలకోసం ఎన్‌డీడీబీకి పంపారు. రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు తిరిగి ఆగస్టులో మళ్లీ వచ్చాయి, వాటిని నేయి తయారీకి వాడారని చెప్తున్నారు. అంటే తప్పు ఎవరిది అవుతుంది? ఆరోపణలు వచ్చిన ట్యాంకర్లన్నీకూడా చంద్రబాబు పరిపాలనా కాలంలోనే కదా సప్లై అయినవి?
పాలు లేకుండా నేయి తయారైందని అంటున్నారు. అలాంటప్పుడు ఏ ట్యాంకర్ కూడా పరీక్షల్లో ప్యాస్ కాకూడదు కదా?
నేయిలో కల్తీ జరిగితే.. మేనేజ్ చేశారను అనుకుందాం.. అసలు నేయి లేకుండానే కెమికల్స్‌తో ఆర్టిఫిషయల్ నేయి తయారు చేశారన్నట్టుగా రిమాండ్ రిపోర్టులో రాశారు. ఇన్ని లక్షలమంది భక్తులు, ఇన్ని వందలాదిమంది తయారీదారులు.. నిజంగా కనిపెట్టలేకపోయారా? అసలు అలా తయారు చేసిన లడ్డూ నిల్వ సాధ్యమేనా? ఇవన్నీ సామాన్యులకు వస్తున్న సందేహాలు.
రిమాండ్ రిపోర్టులో చూస్తే.. మార్చి 27, 2025 నాటి ఎన్‌డీడీబీ రిపోర్టు అని కోట్ చేస్తూ.. నేయి శాంపిళ్లను పరిశీలిస్తే.. పామాయిల్, పామ్ స్టెరిన్, పామ్ కెన్నెల్ ఆయిల్ కలిసిందని నువ్వే చెప్తున్నావు, అంటే చంద్రబాబు వచ్చిన 8 నెలల తర్వాతకూడా, పైగా తిరుమల లడ్డూపై సెప్టెంబరులో చంద్రబాబు కామెంట్లు చేసిన తర్వాత కూడా ఇలాంటి రిపోర్టు వస్తే దానికి బాధ్యత చంద్రబాబుదే కదా? ఈ ప్రభుత్వానిదే కదా? దాన్ని కూడా ఏరకంగా మరొకర్ని తప్పుబడతారు.
మా హయాంలో కేజీ నేయి రూ.319లకు కొంటే తప్పుబట్టారు. కాని చంద్రబాబు హయాంలో రేట్లు చూస్తే.. రూ.273, 276, 279, 295, 285గా ఉన్నాయి. మరి దాని అర్థం చంద్రబాబుగారి హయాంలో నేయిలో బాగా కల్తీ ఉందనేదిగా దాని అర్థం? వాళ్ల సిద్ధాంతం ప్రకారమే ఇది వాస్తవమే కదా మరి?
ఇదీ చదవండి:
‘ఎందుకీ ఆరోపణలు.. ఆధారాలు ఉంటే సిట్ ప్రకటించవచ్చు కదా?’


