తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ ఎస్‌ఎస్‌సీ-2025లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన నంద్యాల విద్యార్థిని ఇష్రత్ కలిశారు. దీనిలో భాగంగా ఎస్‌ఎస్‌సీలో 600 మార్కులకు 599 మార్కులు సాధించిన ఇష్రత్‌ను వైఎస్ జగన్ అభినందించారు. ఇష్రత్‌ను అభినందించడంతో పాటు లక్ష రూపాయిలు ప్రోత్సాహం కూడా అందించారు వైఎస్ జగన్.
ఈ మేరకు వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ ప్రతి విద్యార్థిని చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన వస్తుంది. ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి. చదువు వలనే సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రతీ విద్యార్థి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలి’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.


