ప్రారంభమైన నాటకోత్సవాలు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : కొత్త ప్రయోగాలకు వేదికగా గుంటూరు కళాపరిషత్ 28 ఏళ్లుగా సాగుతుందని కళాపరిషత్ అధ్యక్షుడు పీవీ మలికార్జునరావు అన్నారు. గుంటూరు మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో మూడు రోజులపాటు జరగనున్న గుంటూరు కళాపరిషత్ 28వ వార్షిక నాటకోత్సవాలను శుక్రవారం అతిథులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన పీవీ.మల్లికార్జునరావు మాట్లాడుతూ కళాపరిషత్ సమయపాలనతో ముందుకెళ్తుందని అన్నారు. ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు, కార్యదర్శి అమ్మిశెట్టి శివలు మాట్లాడారు. సభను కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణారావు, పరిషత్ ఉపాధ్యక్షులు ధనియాల గాంధీ, కార్యదర్శి అమ్మిశెట్టి శివ, కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, పరిషత్ ప్రధాన కార్యదర్శి బి.పూర్ణ, ఉపాధ్యక్షులు నాయుడు గోపి, కార్యదర్శి గుమ్మడి నాగేశ్వరరావు పర్యవేక్షించారు. మాయాజాలం నాటిక శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం(బొరివంక) ఆధ్వర్యంలో ప్రదర్శించగా, ఈ నాటికకు సలీం మూలకథ సమర్పించగా, కేకేఎల్ స్వామి దర్శకత్వం వహించారు. విజయవాడ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో మమ్మల్నీ బతకనీయ్యండి నాటికను ప్రదర్శించగా, సుఖమంచి కోటేశ్వరరావు రచించి దర్శకత్వం వహించారు.
ప్రారంభమైన నాటకోత్సవాలు


