వైద్య కళాశాలలో ఫిజియాలజీ ఆధునికీకరణ
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల ఫిజియాలజీ వైద్య విభాగం ఆధునికీకరణకు గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థి, బ్రిందా హాస్పిటల్ అధినేత, బాహుబలి సర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి కుటుంబం రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. వారి విరాళంతో ఆధునికీకరించిన ఫిజియాలజీ వైద్య విభాగాన్ని శుక్రవారం డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ అనిత దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. శాస్త్రవేత్త ఆర్ధర్ గైటన్ విగ్రహాన్ని డాక్టర్ శ్రీనివాసరెడ్డి దంపతులు ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, దాత డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అకడమిక్ డాక్టర్ మాధవి, అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్ మారుతి పాల్గొన్నారు.
డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి కుటుంబం రూ.10లక్షల విరాళం


