సాక్షి, తాడేపల్లి: భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు నూరీ ఫాతిమా, షేక్ ఆసిఫ్, మెహబూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు.
‘‘ఆ మహనీయునికి ఘన నివాళులు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరం. మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.
"భారత రత్న" మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరం.
మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/rKD6LTwvNb— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2025


