సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ మరో డ్రామాకు తెరతీసింది. సుప్రీంకోర్టు, సిట్ ఉండగా కమిటీ మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. చంద్రబాబుకి వ్యతిరేకంగా సీబీఐ రిపోర్ట్ రావడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది. సీబీఐ చెప్పిన నిజాలను జీర్ణించుకోలేక కొత్త కమిటీ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై మరో విచారణ కమిటీ అంటూ హడావుడి చేస్తోంది.
జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించగా.. సీబీఐ ఇచ్చిన నివేదిక తమకు అనుకూలంగా లేదని టీడీపీ ఫ్రస్టేషన్‌లో ఉంది. దీంతో సీబీఐని తప్పు పడుతూ కొద్దిరోజులుగా కుట్రపూరిత ప్రచారం చేసింది. సీబీఐ సరిగ్గా విచారించలేదంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేసింది. సీబీఐ రిపోర్ట్‌లో లోపాలంటూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెరలేపింది. ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి తిరుమల ప్రసాదంపై టీడీపీ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టింది.
దుష్ప్రచారానికి కొనసాగింపుగా మరో విచారణ కమిటీ వేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తమ చెప్పుచేతుల్లో ఉండే అధికారులతో కమిటీ వేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. తమకు నచ్చినట్టు నివేదిక రాయించుకోవడానికి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తిరుమలపై దుష్ప్రచారం చేయాలని వ్యూహం రచిస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని చూసి న్యాయ నిపుణులు విస్తుపోతున్నారు.


