సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై విచారణ జరిపిన సీబీఐ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కూటమి అపచారానికి వైఎస్సార్‌సీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పూజలు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా, కూటమి ప్రభుత్వం పాపం మీద పాపం చేస్తూ తిరుమల క్షేత్రానికి కళంకం తీసుకువచ్చింది. దీంతో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ ప్రపంచ వ్యాప్తంగా భక్తుల డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడ
- ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కామెంట్స్..
- ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటారా?.
- ప్రసాదంలో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిసిందని చెప్తారా?.
- రాజకీయాల కోసం దేవుడిని కూడా లాగుతారా.
- రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు క్షమాపణ చెప్పాలి.
- జరగని ఒక ఘటన జరిగిందని ప్రచారం చేసారు సీబీఐ అలాంటిది ఏమి లేదని చెప్పింది.
- పవన్ కళ్యాణ్ దుర్గా గుడికి వచ్చి మళ్ళీ మెట్లు కడగాలని డిమాండ్ చేస్తున్నా.
- కూటమి నేతలు రాష్ట్ర ప్రజలకు మొహం చూపించలేక సమాధానం చెప్పలేక తిరుగుతున్నారు.

కర్నూలు..
- కల్లూరు అర్బన్‌లోని వై జంక్షన్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు
- నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి అపచారానికి పరిహారంగా ప్రత్యేక పూజలు
- చంద్రబాబు, పవన్ చేసిన అపచారానికి పరిహారంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులు
- వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకన్నను వేడుకుంటూ టెంకాయలు కొట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలు

విజయవాడ
- లబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పాప పక్షాళన పూజలు
- పూజలు చేసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు.
- బందర్ రోడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ చేసిన పార్టీ శ్రేణులు
- చంద్రబాబు, పవన్ వెంకటేశ్వర స్వామికి భక్తులకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు
విశాఖ..
- సీతమ్మధార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు.
- పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మొల్లి అప్పారావు, మాజీ మేయర్ హరి వెంకట కుమారి , పార్టీ నేతలు.
- తిరుపతి లడ్డుపై తప్పుడు ప్రచారంపై నేతలు ఆగ్రహం.
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్.
- కూటమికి మంచి బుద్ది ప్రసాదించాలని పూజలు..
వైయస్సార్ జిల్లా...
- బద్వేలు పట్టణం సిద్ధపటం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..
- కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారానికి వ్యతిరేకంగా ఆలయంలో 101 టెంకాయ కొట్టి పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులు...
- కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పులివెందుల నాయకులు ప్రత్యేక పూజలు
విశాఖ..
- మురళీనగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు..
- కేకే రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..
- తిరుమల లడ్డూ అంశంలో తప్పుడు ప్రచారంపై పార్టీ నేతల ఆగ్రహం..
- ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టిన నేతలు..
- పాప పరిహార పూజకు భారీగా హాజరైన పార్టీ శ్రేణులు..



