
అమరావతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు స్వతంత్రంగా నిష్పక్షపాతంగా కొనసాగాలని.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు అని పేర్కొంది.
అమూల్యమైన లడ్డూ ప్రసాదం పవిత్రతపై ఏర్పడిన వివాదంపై జరుగుతున్న దర్యాప్తు ఇది.. అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దర్యాప్తును స్వయంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జె.వెంకట్రావువు నియామకం తగదని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. వెంకట్రావు సుప్రీంకోర్టు సిట్ సభ్యుడు కాదని.. ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. కాబట్టి ఆయనకు దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదని తెలిపింది.