
ఎవరి టేస్ట్ వారికి ఆనందం. అలాంటి ఆనందమే ప్రయోగాలకు వేదికై కొత్త ఆవిష్కరణకు దారి తీస్తుంది. ఒక యువకుడు తయారు చేసిన ‘లిక్విడ్ లడ్డు’ వీడియో నెట్‌లోకంలో చక్కర్లు కొడుతూ నోరూరిస్తోంది.‘
లొట్టలు వేయనక్కర్లేదు. మీరు కూడా ఎంచక్కా ఇలా తయారు చేసుకోవచ్చు’ అని వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించాడు లిక్విడ్ లడ్డు సృష్టికర్త.
ఈ లిక్విడ్ లడ్డు వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి, ‘ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి!’ అనే డైలాగు మనకు తెలిసిందే కదా. ఎవరూ చేయనిది కొత్త వంటలెలా పుడతాయి! అందుకే....ఈ లిక్విడ్ లడ్డు సృష్టికర్తకు ‘వెరీ గుడ్’ అని ప్రశంసలు వచ్చాయి.
(చదవండి: నేచురల్ హెయిర్ జెల్..! జుట్టు పెరగడమే కాదు..హెల్దీ కూడా..)