
జుట్టు పెరగడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమైన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పే చిట్కా మాత్రం పని చేసే అవకాశాలు అధికం. ఎందుకంటే... ఈ చిట్కా కోసం వాడే పదార్థాలు పోషకాలతో నిండినవి. అవేంటంటే చియా గింజలు, గంజి. ఈ చిట్కా పాటించాలంటే ముందుగా అరకప్పు బియ్యం నానబెట్టిన నీళ్లు లేదా లేదా గంజిలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ చియా సీడ్స్, రెండు కప్పుల నీళ్లు తీసుకుని బాగా మరగబెట్టాలి. దాదాపుగా ఇవి జెల్‌లా మారిపోతాయి.
అప్పుడు దించి, చల్లారిన తర్వాత రోజ్ మేరీ లేదా లావెండర్ ఆయిల్ కలిపి, వడపోయాలి. ఈ లిక్విడ్‌ని ఓ గ్లాస్ జార్ లేదా బాటిల్ లోకి పోసుకుని కనీసం వారం రోజుల పాటు ఫ్రిజ్ లో నిల్వ చేయాలి. ఆ తరవాత దీనిని తీసుకుని ఎక్కుడైతే జుట్టు పలచబడిందో అక్కడ కాస్త ఎక్కువగా అప్లై చేసి మాడంతా మృదువుగా మసాజ్ చేయాలి.
దీనివల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. కనీసం అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తరవాత గోరు వెచ్చని నీటితో జుట్టుని శుభ్రం చేసుకోవాలి. వారానికి కనీసం రెండు మూడుసార్లు ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు బట్టతలపై కూడా వెంట్రుకలు వచ్చే అవకాశాలుంటాయి.
(చదవండి: మెరుగైన ఆరోగ్యం కోసం..జస్ట్ ఏడువేల అడుగులు..!: న్యూ స్టడీ)