సమాధానం చెప్పలేక బాబు అసహనం | Chandrababu expressed strong anger over the questions asked by the media | Sakshi
Sakshi News home page

సమాధానం చెప్పలేక బాబు అసహనం

Feb 6 2026 5:00 AM | Updated on Feb 6 2026 5:00 AM

Chandrababu expressed strong anger over the questions asked by the media

జంతు కొవ్వు కలిసిందని తాను చేసిన ఆరోపణలపై అనుకూల మీడియా అడిగిన ప్రశ్నలపై తీవ్ర ఆగ్రహం 

సీబీఐ ఇచ్చిన నివేదికపై ఏకసభ్య కమిషన్‌

సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ వ్యవహారం గురించి మాట్లాడేందుకు జనసేన, బీజేపీతో కలసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తీవ్ర అసహనం ప్రదర్శించారు. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్‌ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేయడంపై తన అనుకూల మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. 

ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ తదితరులతో సీఎం గురు­వారం సమావేశం నిర్వహించి లడ్డూ వ్యవహారంపై చర్చించారు. అనంతరం వారందరితో పాటు ఐదుగురు మంత్రులతో కలసి మీడియాతో మాట్లాడారు. సిట్‌ చార్జిషీట్‌లో జంతువుల కొవ్వు లేదని ఉంది  కదా? అన్న విలేకరుల ప్రశ్నకు ఒక్కసారిగా ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

‘లేదని ఎక్కడుంది..? నీకేమైనా కల వచ్చిం­ందా..? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా..? వాట్‌ ఆర్‌ యూ టాకింగ్‌..? మర్యాదగా చెబితే వినాలి..’ అంటూ చిందులు తొక్కారు. ఆ ప్రశ్న అడిగింది ఎల్లో మీడియా రిపోర్టరే కావడంతో కొంత తమాయించుకున్నా, ఆగ్రహాన్ని మాత్రం దాచుకోలేకపోయారు. సిట్‌ వేసిన చార్జిషీట్‌ ఇంకా నంబర్‌ అవలేదని, ఒక నివేదికను తమకు పంపి చర్యలు తీసుకోవాలని కోరిందని తెలిపారు. దానిపై ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే కోర్టుకు అదనపు వివరాలు ఇస్తామని చెప్పారు. 

సిట్‌ నివేదికలో రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారైనట్లు ఉందన్నారు. సీబీఐ నివేదికలో ఎక్కడా కల్తీ లేదని చెప్పలేదన్నారు. ఎన్‌డీడీబీ నివేదికలోని అంశాన్నే తాను ప్రస్తావించానని చెప్పారు. హిందూ మతంలో విడాకులు ఇవ్వడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీడీబీ నివేదికను చంద్రబాబు తమకు చదివి వినిపించారని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. టీటీడీ సహా అనేక పెద్ద ప్రాజెక్టుల్లో అక్రమాలకు గత ప్రభుత్వం తెర తీసిందని పీవీఎన్‌ మాధవ్‌ ఆరోపణలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement