కోల్‌కతా వైద్యురాలి కేసు : సందీప్‌ ఘోష్‌ ఇళ్లపై సీబీఐ దాడులు! | CBI raids residence of RG Kar ex-principal Sandip Ghosh in corruption probe | Sakshi
Sakshi News home page

కోల్‌కతా వైద్యురాలి కేసు : సందీప్‌ ఘోష్‌ ఇళ్లపై సీబీఐ దాడులు!

Aug 25 2024 3:33 PM | Updated on Aug 25 2024 4:19 PM

CBI raids residence of RG Kar ex-principal Sandip Ghosh in corruption probe

కోల్‌కతా : కోల్‌కతా ఆర్‌జీకార్‌ ఆస్పత్రి దుర్ఘటనపై సీబీఐ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆర్‌జీకార్‌ ఆస్పత్రిలో జరిగిన దారుణంలో  ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీష్‌ ఘోష్‌ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సైతం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆదివారం 15 ప్రాంతాల్లో సందీష్‌ ఘోష్‌ పాటు ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సందీప్‌ ఘోష్‌తో పాటు ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి ఫోరెన్సిక్‌ మెడిసిన్‌,టాక్సాలజీ విభాగానికి చెందిన డాక్టర్‌ డెబాషిస్‌ సోమ్‌ ఇంటికి సైతం సీబీఐ అధికారులు వెళ్లారు.

మూడురోజుల ముందు ఆర్‌జీకార్‌ ఆస్పత్రిలో మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్‌ అక్తర్‌ అలీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌తో పాటు, డెబాషిస్‌ సోమ్‌పై ఆరోపణలు చేశారు.  

అనంతరం సీబీఐ అధికారులు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో శనివారం సందీప్‌ ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం సందీష్‌ ఘోష్‌ ఇల్లు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో చేస్తున్న తనిఖీలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement